లాక్ డౌన్ సమయంలో పెళ్లి.. వధూవరుల అరెస్టు

లాక్ డౌన్ సమయంలో పెళ్లి.. వధూవరుల అరెస్టు
  • 50 మంది గెస్టులు కూడా అదుపులోకి

ప్రపంచం అంతటా వైరస్ వ్యాప్తిస్తుంటే మీకు పెళ్లి కావాల్సి వచ్చిందా అంటూ పెళ్లి పీటల మీదున్న వధూవరులను పోలీసులు అరెస్ట్ చేశారు. లాక్ డౌన్ రూల్స్  పాటించకుండా పెళ్లికి అటెండ్ అయిన 50 మంది గెస్టులను కూడా పోలీస్ స్టేషన్ కి తరలించారు. వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా ప్రపంచం అంతటా పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటుంటే సౌత్ ఆఫ్రికాలోని క్వాజులా నటాల్ కు చెందిన ఓ కపుల్ మాత్రం అనుకున్న టైంకి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. చుట్టాలు, ఫ్రెండ్స్ 50 మందిని పిలిచి ఆదివారం గ్రాండ్ గా వేడుక చేసుకుందామనుకుంది. అంతా రెడీ అయ్యి పెళ్లి టైం దగ్గర పడగానే పోలీసులు ఎంటర్ అయ్యారు. వేడుక నిలిపివేసి.. అందర్నీ దగ్గరలోని స్టేషన్ కి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లిని కొనసాగిస్తామని చెప్పేందుకు వారి దగ్గర ఎటువంటి ఆప్షన్ లేదని, ప్రతి ఒక్కరికీ కౌన్సెలింగ్ ఇచ్చి బెయిల్ పై విడుదల చేసినట్లు అక్కడి పోలీస్ ఆఫీసర్ మీడియాకు వెల్లడించారు.