పెళ్లైన కాసేపటికే భర్తను వదిలేసి.. ప్రియుడితో జంప్

V6 Velugu Posted on Sep 18, 2021

పెళ్లి చేసుకున్న కొద్దిసేపటికే పెళ్ళికొడుకును వదిలేసి ప్రియుడితో పరారైంది పెళ్ళికూతురు. పెళ్లి కోసం ఇచ్చిన బంగారం, నగదుతో ఉడాయించింది. ఈ ఘటన హైదరాబాద్ బాలాపూర్ లో జరిగింది. బెంగళూరుకు చెందిన మహమ్మద్ ఇలియాస్ కు హైదరాబాద్ పాతబస్తీకి సమ్రిన్ బేగంతో ఓ ఇంట్లో  పెళ్లి జరిగింది. ముందుగా ఒప్పుకున్న ప్రకారం వరుడు 2 లక్షల విలువైన బంగారం, 50 వేల నగదు వధువుకు ఇచ్చాడు. పెళ్లి జరిగాక బ్యూటీ పార్లర్ కంటూ పెళ్లి కూతురును తీసుకొని ఆమె మేనత్త, చిన్నమ్మ బయటకు వెళ్లారు. అయితే గంటలు గడ్తుస్తున్నా పెళ్లి కూతురు రాకపోవడంతో ఆమె మేనమామలను నిలదీశాడు పెళ్లి కొడుకు ఇలియాస్. దీంతో సమ్రిన్ బేగం ప్రియుడితో కలిసి పరారైన విషయం బయటపడింది. తనకు పెళ్లి కూతురు అవసరం లేదని, తాను ఇచ్చిన బంగారం, నగదు, పెట్టిన ఖర్చులు ఇవ్వాలంటున్నాడు ఇలియాస్. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సమ్రిన్ బేగం బంధువులకు వార్నింగ్ ఇచ్చాడు. 

Tagged married, HUSBAND, boyfriend, bride, jump, Hyderabad

Latest Videos

Subscribe Now

More News