
కేరళలోని తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయ్యింది ఏయిర్ ఇండియా 657విమానం. విమానంలో బాంబు ఉందన్న బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని.. ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నారు. వెంటనే విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. ఫ్లైట్ లో 135మంది ప్రయాణీకులు ఉన్నారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితి విధించారు అధికారులు.