ఉమ్మడి నల్గొంగ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొంగ జిల్లా సంక్షిప్త వార్తలు

విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

సూర్యాపేట వెలుగు : సూర్యాపేట కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులను స్పీడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులను, వివిధ విభాగాల కోసం ఏర్పాటు చేసిన ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆదివారం ఆయన పరిశీలించారు. నిర్మాణాలకు సంబంధించి ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఒకే గొడుగు కిందకు తేవాలన్న ఉద్దేశంతోనే ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ భవనంలో 28 శాఖల ఆఫీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రుల కోసం ‘స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా పర్యటనకు మంత్రులు వచ్చిన టైంలో రివ్యూ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంగణంలో మొక్కలు నాటాలని ఆఫీసర్లకు సూచించారు. 

నాటిన ప్రతిమొక్కనూ రక్షించాలి

మొక్కలు నాటడమే కాదు.. నాటిన ప్రతి మొక్కనూ కాపాడుకోవాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందన్నారు. కిరాణా మర్చంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్, మున్నూరు కాపు మహాసభ, ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేటలో నిర్వహించిన వనభోజన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. వనభోజనాలు ప్రజల చైతన్యానికి ప్రతీకలన్నారు. సామూహిక వనభోజనాల వల్ల సమష్టి బాధ్యత, సాన్నిహిత్యం పెరుగుతుందన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నపూర్ణ, ఎలిమినేటి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అభయ్, డాక్టర్ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్ర ఉన్నారు.

లైబ్రరీలను కాపాడుకోవాలి

లైబ్రరీలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. సూర్యాపేటలో ఆదివారం జరిగిన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వాలు లైబ్రరీలను పట్టించుకోలేదని విమర్శించారు. లైబ్రరీల అభివృద్ధికి టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. లైబ్రరీలకు పక్కా బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మౌలిక వసతులు కల్పించడంతో పాటు పుస్తకాలు అందించడం, సిబ్బంది నియామయం చేస్తున్నట్లు తెలిపారు. కాంపిటీటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యే క్యాండిడేట్లు లైబ్రరీలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రతి మండలానికి ఒక డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైబ్రరీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం లైబ్రరీ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలిచిన స్టూడెంట్లకు ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిమ్మల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుమాండ్ల అన్నపూర్ణ, మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉప్పల లలితా ఆనంద్, కౌన్సిలర్ నిమ్మల స్రవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు.

టీచర్లు నిబద్ధతతో పనిచేయాలి

నేరేడుచర్ల, వెలుగు : టీచర్లు నిబద్ధతతో పనిచేయాలని హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఆదివారం జరిగిన టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూటీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహాసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎనిమిదేళ్లలో ప్రభుత్వం 1650 గురుకుల స్కూళ్లను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. టీచర్ల కృషితోనే విద్యా విధానంలో మార్పులు వస్తాయని, నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు, దాతల  సహకారంతో స్కూళ్లను అభివృద్ధి చేయాలని సూచించారు. స్కూళ్లలో సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూటీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమయ్య, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు నరసింహారావు, నాయకులు రాములు, రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, నాగమణి, నేరేడుచర్ల మున్సిపల్ వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చల్లా శ్రీలతారెడ్డి పాల్గొన్నారు.

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి

మఠంపల్లి, వెలుగు : సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే సైదిరెడ్డి చెప్పారు. మఠంపల్లి మండలంలోని మంచ్యాతండాలో ఆదివారం నిర్వహించిన బంగారు మైసమ్మ తల్లి ఉత్సవాలకు ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

బూరుగడ్డ ఆలయంలో ప్రత్యేక పూజలు

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : సూర్యాపేట జిల్లా బూరుగడ్డ ఆదివరాహా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఆదివారం ఎమ్మెల్యే సైదిరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద నిర్మించిన షెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. అలాగే మాచవరం కాలనీలో సీసీ రోడ్లు, ఎంపీపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జడ్పీటీసీ సైదిరెడ్డి, బూరుగడ్డ సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సలీమా రంజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దేవాలయ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాగరాజు పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయం ఖాయం

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/కోదాడ, వెలుగు : టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన పలువురు ఆదివారం హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నూకల సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, బొల్లేపల్లి వెంకన్నగౌడ్, సురసాని అజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, తాళ్ల రామకృష్ణారెడ్డి, చిన్న రామకృష్ణారెడ్డి, జంగిలి వెంకన్న పాల్గొన్నారు. అనంతరం గౌడ, మున్నూరు కాపు, కమ్మ కుల సంఘాల వనభోజనాల్లో పాల్గొన్నారు. అనంతరం మున్నూరుకాపు, పద్మశాలి, ఆర్యవైశ్య, పెరిక, రజక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన వనభోజనాలకు కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హాజరయ్యారు. 

పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు

నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : దేశంలో ఎక్కడాలేనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. నల్గొండ జిల్లా  నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం దాసరిగూడెం, పోతినేనిపల్లి చేపట్టిన పలు అభివృ-ద్ధి పనులను ఆదివారం జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండా నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కులమతాల పేరుతో చిచ్చు పెడుతోందని, బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మనీ తీసుకొస్తానని చెప్పిన ఇప్పటివరకు ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. ఢిల్లీ గడ్డపైన గులాబీ జెండా ఎగురవేసేలా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విమర్శించే హక్కు బీజేపీ లీడర్లకు లేదన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమేనన్నారు. మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు భారీగా పెరిగాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేగట్టె మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీపీ కల్లూరి యాదగిరి, సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉప్పల అనంతలక్ష్మి రాంరెడ్డి, లింగస్వామి, ఎంపీటీసీ బొక్క భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మండల  అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

గిరిజనుల రాజ్యాధికారానికి కృషి

కోదాడ, వెలుగు : గిరిజనులు రాజ్యాధికారం సాధించే దిశగా తెలంగాణ లంబాడా సేవా సమితి కృషి చేస్తోందని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. టీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంగారభేరి ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలు అమలు చేయాలని, జీవో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3ను పునరుద్ధరించాలని, గిరిజన తండా పంచాయతీలను రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. పేద గిరిజనులకు 5 ఎకరాల భూమి పంపిణీ చేయాలని, గిరిజనబంధు ప్రకటించడంతో పాటు, ఫిబ్రవరి 15 సేవాలాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బాదావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైదులు నాయిక్, సినీ నటుడు రాజీవ్ చౌహన్, ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పందిరి నాగిరెడ్డి, టీఎల్ఎస్ఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పద్మ బాయి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మత్రు నాయక్, ప్రధాన కార్యదర్శి పీకా నాయక్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి స్రవంతీబాయి పాల్గొన్నారు. 

రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఓయూ జేఏసీ ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్ రాజారాం యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరోపించారు. ‘కేంద్ర ప్రభుత్వం – రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం’ అనే అంశంపై ఓయూ జేఏసీ, టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జేఏసీ, సామాజిక, ప్రజా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులతో ఆదివారం నల్గొండలో జరిగిన రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో దేశంలో అనేక అరాచకాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ సంస్థలపై ఆధిపత్యం చలాయిస్తూ సొంత లాభం కోసం వాడుకుంటోందని ఆరోపించారు. రిటైర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చొల్లేటి ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఓయూ జేఏసీ అధ్యక్షుడు అశోక్, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాయకులు చీర పంకజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సుంకరి మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బక్కతట్ల వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సైదులు, అంబటి వెంకన్న, నేతి రఘుపతి పాల్గొన్నారు.

గెలుపోటములను సమానంగా తీసుకోవాలి

యాదగిరిగుట్ట, వెలుగు : ఆటల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని డీసీసీబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొంగిడి మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానుగు కవిత బాలరాజుగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. ఆటల వల్ల శారీరక ధృఢత్వం పెరుగుతుందన్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో నిర్వహించిన క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీల్లో గెలుపొందిన వారికి ఆదివారం కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మనీ అందజేసి మాట్లాడారు. చదువుతో పాటు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ముఖ్యమేనని, ఆటల్లో పాల్గొనేలా పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచిన కంచనపల్లి టీంకు వంగపల్లి మాజీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్రగాని నిరోషా జహంగీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ. 15 వేలు ఇవ్వగా, సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించిన టీంకు వంగపల్లి సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానుగు కవిత బాలరాజుగౌడ్ రూ.10 వేలు అందజేశారు. కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డమీది రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మంగళగిరి రవిచందర్, ఉపసర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేపాక స్వామి, ఆర్గనైజర్లు కానుగు రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లక్ష్మణ్, వీరేందర్ పాల్గొన్నారు.

కవితపై ఆరోపణలు చేస్తే సహించం

హాలియా, వెలుగు : ఎమ్మెల్సీ కవితపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్చరించారు. నల్గొండ జిల్లా హాలియాలోని పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. కవిత కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరుతుందని ఎంపీ అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. గవర్నర్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బీజేపీకి మద్ధతు పలకడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీపై తప్పుడు ప్రచారం చేస్తే టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రేణులు చూస్తూ ఊరుకోరన్నారు. సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉప ఎన్నికల టైంలో సీఎం ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేస్తున్నారన్నారు. సమావేశంలో జడ్పీ వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరిగి పెద్దులు, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, మండల అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రావుల రాంబాబు, కౌన్సిలర్లు నల్గొండ సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నల్లబోతు వెంకటయ్య, అన్నెపాక శ్రీనివాస్, ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్లులను విడుదల చేయాలి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్లులను విడుదల చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆదివారం నల్గొండలో నిర్వహించిన మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరలు పెరగడం, ప్రభుత్వం బిల్లులు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైంలో చెల్లించకపోవడంతో మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లుగానే స్కూళ్లకు కూడా ప్రభుత్వమే గుడ్లు సరఫరా చేయాలని, వంట షెడ్లు నిర్మించడంతో పాటు, కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని కోరారు. అనంతరం యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నూతన కమిటీ అధ్యక్షకార్యదర్శులుగా కరీమున్నీసా, పోలె సత్యనారాయణను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు భీమగాని గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పోలగాని యాదమ్మ, కిన్నెర సైదమ్మ, ఉమాదేవి, సైదులు, అలివేలు, రాములమ్మ, రాములు, ముత్తమ్మ, దమయంతి పాల్గొన్నారు.