ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని బీజేపీ లీడర్లు, అభిమానులు ఆకాంక్షించారు. బుధవారం వివేక్ పుట్టిన రోజు సందర్భంగా ఉమ్మడి కరీంనగర్​జిల్లావ్యాప్తంగా అభిమానులు కేక్​లు కట్ చేయడంతోపాటు పేదలకు అన్నదానం, చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమంలో లీడర్లు సురేశ్​రెడ్డి, సజ్జాద్, కాడే సూర్యనారాయణ, రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, బీజేపీ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఇన్​చార్జి మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌, పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ కన్వీనర్‌‌‌‌‌‌‌‌ మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌, స్టేట్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ కౌశిక హరి, దళిత సంఘాల జేఏసీ స్టేట్ చైర్మన్ అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. -  వెలుగు, నెట్​వర్క్​


సంక్రాంతిలోగా ఇండ్లు అందించాలి 

చొప్పదండి, వెలుగు: మండలంలోని చొప్పదండి, ఆర్నకొండ గ్రామాల్లో నిర్మిస్తున్న డబుల్​ బెడ్ రూమ్​ఇండ్లను సంక్రాంతిలోగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కరీంనగర్​కలెక్టర్ కర్ణన్​ అధికారులను ఆదేశించారు. చొప్పదండి, ఆర్నకొండ గ్రామాల్లో నిర్మిస్తున్న ఇండ్లను బుధవారం వారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కరెంట్​పనులు త్వరగా పూర్తి చేయాలని, ఇండ్ల మధ్యలో సీసీ రోడ్డుకు, డ్రైనేజీకి కావల్సిన నిధులు మంజూరు చేస్తామ
ని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే చొప్పదండి మండలం రుక్మాపూర్​ సైనిక్ స్కూల్​లో జరుగనున్న నెహ్రూ సైన్స్ సెమినార్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ రవీందర్, జడ్పీటీసీ సౌజన్య, వైస్​ చైర్మన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


తూము గేటు ఓపెన్ చేయొద్దు

వీర్నపల్లి, వెలుగు: అధికారుల పర్మిషన్ లేకుం డా మండల కేంద్రంలోని వెంకట్రాయిని చెరువు తూము గేట్​ను ఓపెన్ చేయొద్దని ఇరిగేషన్ డీఈ సత్యనారాయణ సూచించారు. బుధవారం ఎల్లారెడ్డిపేట సీఐ మొగిలాల్ తో కలిసి ఆయన గేట్​ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువులో భూములు మునిగిన రైతులు జిల్లా అధికారులకు తెలియజేసి సమస్య పరిష్కరించుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్లు తూము గేటును ఓపెన్ చేస్తే చర్యలు తప్పవన్నారు. సీఐ మోగిలాల్  మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వారివెంట తహసీల్దార్ తఫాజుల్ హుస్సేన్, ఇరిగేషన్ ఏఈ కృష్ణ కాంత్, రైతులు ఉన్నారు.


అటు రిటైర్మెంట్.. ఇటు పోస్టింగ్ 

కరీంనగర్, వెలుగు: శాతవాహన విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సోషియాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వన్నాల రమేశ్​ బుధవారం ఉద్యోగ విరమణ పొందిన వెంటనే అకౌంట్ ఆడిట్ సెల్ విభాగానికి  డైరెక్టర్ గా నియమితులయ్యారు. అలా రిటైర్ అయ్యారో లేదో వెంటనే పోస్టు కేటాయించడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రమేశ్ కొంత కాలం నుంచి వీసీకి ఓఎస్ డీ గా పని చేస్తున్నారు. ఓయూ వంటి యూనివర్సిటీల్లోనే ఓఎస్ డీ పోస్టు లేదు. రిటైరైన వాళ్లు  పాలనావిభాగంలో పని చేయడానికి వీల్లేదు. అయినా నిబంధనలకు విరుద్దంగానే పోస్టింగ్ ఇచ్చారు. ఎటువంటి   నోటిఫికేషన్ లేకుండా, కనీసం యూనివర్సిటీ ఈసీ మీటింగ్ లోనైనా చర్చించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


‘పరిహారం ఇయ్యకుంటే భిక్షమెత్తుకుంటం’ 

తంగళ్లపల్లి,వెలుగు: పంట నష్టానికి పరిహారం ఇవ్వకుంటే భిక్షమెత్తయినా తమ బాధలు తీర్చుకుంటామని మండలంలోని బస్వపూర్ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితం అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన తమను ఆదుకోవడంలో మంత్రి కేటీఆర్ విఫలమయ్యారని అన్నారు. బుధవారం  గ్రామంలో నిర్వహించిన సమావేశంలో రైతులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మంత్రి కేటీఆర్ ను కలవడానికి వెళితే అవమానం జరిగిందని ఆరోపించారు. నష్ట పరిహారం ఇచ్చేదాకా అందరం ఒక్కటై నడుస్తామని తీర్మానించారు. సిరిసిల్ల పట్టణంలో భిక్షాటన చేసి నష్టాన్ని పూడ్చుకుంటామని అన్నారు. నేటి నుంచి తమ కార్యాచరణను అమలు చేయనున్నట్లు రైతులు పేర్కొన్నారు.


‘ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి’

వేములవాడరూరల్, వెలుగు : ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని బీజేపీ మండలాధ్యక్షుడు జక్కుల తిరుపతి అన్నారు. బుధవారం వేములవాడ భీమేశ్వర గార్డెన్స్ లో నిర్వహించిన పార్టీ మండల కార్యవర్గ సమావేశంలో ఆయన నియోజకవర్గ ఇన్​చార్జి  మార్త సత్తయ్యతో కలిసి మాట్లాడారు. పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలన్నారు. అనంతరం సెస్ ఎన్నికల దృష్ట్యా  తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి రవికిషోర్, లీడర్లు పాల్గొన్నారు. 


‘సంగ్రామ యాత్ర సక్సెస్​ చేయాలి’

మెట్ పల్లి, వెలుగు: బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని మెట్ పల్లి పట్టణ ఇన్​చార్జి శీలం వేణు అన్నారు. బుధవారం పట్టణంలో టౌన్ ప్రెసిడెంట్ రమేశ్​అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాత్ర డిసెంబర్ మొదటి వారంలో కోరుట్ల నియోజకవర్గానికి చేరుకుంటుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్.ప్రభాకర్, కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ సుఖేందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సదాశివ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్ తదితరులు పాల్గొన్నారు.

సాదాసీదాగా మున్సిపల్ సమావేశం

సిరిసిల్ల టౌన్, వెలుగు: పట్టణంలో బుధవారం నిర్వహించిన సిరిసిల్ల మున్సిపల్ సాధారణ సమావేశం సాదాసీదాగా జరిగింది. చైర్​పర్సన్ జిందం కళ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో 15 అంశాలను ప్రవేశపెట్టగా పాలకవర్గ సభ్యులతో చర్చించి చైర్​పర్సన్ ఆమోదించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణ సుందరీకరణలో భాగంగా కరీంనగర్ ప్రధాన రహదారిలోని చంద్రంపేట చౌరస్తా, మొదటి బైపాస్ రోడ్డులోని నర్సింగ్ కాలేజీ వద్ద చౌరస్తాను అభివృద్ధి చేయాలని కౌన్సిల్ లో తీర్మానం చేశామన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.