ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

నర్సాపూర్, వెలుగు : రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శనివారం నర్సాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద ‌‌‌‌‌‌‌‌రూ.81 లక్షలతో  నిర్మించిన 10 షెటర్ల షాపింగ్ కాంప్లెక్స్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సాపూర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వడ్లతో పాటు పప్పు దినుసులు కొనుగోలు చేయడంతో రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. స్థానిక ప్రజల అభిప్రాయం మేరకు రోడ్డు వైపు కాంట ఏర్పాటు చేయడంతో పాటు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువుల సంత నడిచేలా సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, మెదక్ చైర్మన్ బట్టి జగపతి, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్, కౌన్సిలర్లు అశోక్ గౌడ్, డైరెక్టర్లు జ్ఞానేశ్వర్, సర్పంచుల పూర్వం అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, నాయకులు రమేశ్​నాయక్, నగేశ్, భిక్షపతి, సాయి చరణ్ గౌడ్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

సంగారెడ్డి, ( రాయికోడ్ ), వెలుగు:  కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. శనివారం రాయికోడ్ మండలంలోని నల్లంపల్లి చౌరస్తాలోని ఎస్ఎస్ పటేల్ ఫంక్షన్ హాలులో పార్టీ మండల అధ్యక్షుడు బాలాజీ నర్సింలు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ గ్రామ కమిటీ, యూత్ కమిటీల సభ్యులను రాజనర్సింహ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చిందన్నారు. హాస్పిటల్స్, స్కూళ్లు, కాలేజీల పరిస్థితి అద్వానంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చామన్నారు. కార్యకర్తలు ఐక్యతగా పనిచేసి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.అంజయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ.ప్రభాకర్, నల్లంపల్లి పీఏసీఎస్ చైర్మన్ నాగిశెట్టి నాయకులు, కార్యకర్తలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి

దుబ్బాక, వెలుగు: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే రఘునందన్​రావు తెలిపారు. శనివారం దుబ్బాక బాలాజీ ఆలయంలో నిర్వహించిన శ్రీలక్ష్మి సుదర్శన హోమం, కూడవెల్లి దేవాలయ ప్రధాన అర్చకులు సాకేత్​ శర్మ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమం, భూంపల్లి- అక్బర్​పేట మండలం మోతే గ్రామంలోని వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు వేధ పండితులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే పట్టు వస్ర్తాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ పాడి పంటలు, సుఖసంతోషాలతో ఉండాలని దైవ సన్నిధిలో కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం మండల పరిధిలోని రాజక్కపేట గ్రామానికి చెందిన కోమటిరెడ్డి ప్రభాకర్​రెడ్డి, దుబ్బాక పట్టణ కేంద్రానికి చెందిన కిష్టమ్మగారి నారాయణరెడ్డి దశదిన కర్మ కార్యక్రమాలలో ఆయన పాల్గొని నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేశ్​గౌడ్​, కౌన్సిలర్​ మట్ట మల్లారెడ్డి, ఎంపీటీసీ పరికి రవి, నాయకులు ఎస్​ఎన్​ చారి, ఇలిటం శ్రీనివాస్​రెడ్డి, భిక్షపతి, సంపంగి 
అశోక్​ పాల్గొన్నారు.

పోడు’ గ్రామసభలో రైతుల ఆందోళన

మెదక్​ (శివ్వంపేట), వెలుగు : శివ్వంపేట మండలం భోజ్య తండా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ పోడు భూముల గ్రామ సభలో రైతులు ఆందోళన చేశారు. 22 మంది రైతులు దరఖాస్తు పెట్టుకోగా 10 మంది రైతుల పేర్లే గ్రామ సభలో ఆమోదించడంతో మిగతా రైతులు నిరసన వ్యక్తం చేశారు. తాతతండ్రుల నుంచి 
భూమి సాగు చేసుకుంటుండగా, ఇప్పుడు ఫారెస్ట్​ ఆఫీసర్లు వచ్చి భూములు గుంజుకుంటున్నారని వాపోయారు. కావాలని కొంతమంది పేర్లను ఆఫీసర్లు తొలగించారని ఆరోపించారు. అందరికీ పోడు పట్టాలివ్వాలని డిమాండ్​ చేశారు. కాగా ప్రభుత్వ గైడ్​ లైన్స్​ ప్రకారం తాము నడుచుకుంటున్నామని ఆఫీసర్లు తెలిపారు. 

మానకొండూర్​ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

కోహెడ(బెజ్జంకి), వెలుగు : మానకొండూర్​ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ అన్నారు. శనివారం బెజ్జంకి   మండల పరిధిలోని తోటపల్లి, గాగిళ్లపూర్, గుగ్గిళ్ల, బెజ్జంకి ఎక్స్​రోడ్డు, దాచారం, ముత్తన్నపేట, బెజ్జంకి గ్రామాల్లో కల్యాణలక్ష్మి, సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను పంపిణీ చేశారు. 
బెజ్జంకిలో డివైడర్​ నిర్మాణానికి, తోటపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం టీఆర్ఎస్​ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ 
ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సూచించారు. 

అమీన్​పూర్​ను మోడల్​మున్సిపాలిటీగా చేస్తాం

రామచంద్రాపురం (అమీన్​పూర్​), వెలుగు:  అమీన్​పూర్​ మున్సిపాలిటీని జిల్లాలోనే ఆదర్శంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. మున్సిపల్​ పరిధిలోని జయలక్ష్మీనగర్, సాయి కాలనీ, మాధవపురి హిల్స్, హెచ్ఎంటీ కాలనీ, వెదిరి, ఆర్టీసీ కాలనీ, వాణీ నగర్​లో రూ. 4 కోట్ల 10 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల దాదాపు  రూ.25 కోట్లతో సీసీ రోడ్లు, యూజీడీ పనులు ప్రారంభించామని, మరో రూ.10 కోట్లతో త్వరలోనే మరికొన్ని పనులు చేపట్టబోతున్నామని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడూ అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్​ చైర్మన్​ పాండురంగారెడ్డి, వైస్​ చైర్మన్​ నర్సింహాగౌడ్​, కమిషనర్​ సుజాత పాల్గొన్నారు. 

ఓటు హక్కును వినియోగించుకోవాలి

సిద్దిపేట రూరల్, వెలుగు : ఓటు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతి ఒక్కరూ ఈ హక్కును వినియోగించుకోవాలని  బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు.  శనివారం పట్టణంలోని ఆంధ్ర బ్యాంకు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో కొత్త ఓటరు నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొననారు.  18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తన పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్ యాదవ్, ఉపేందర్ రావు, గుండ్ల జనార్ధన్, శివకుమార్, సత్యనారాయణ, అరుణరెడ్డి, పద్మ, యాదన్ రావు, కృష్ణ, వెంకట్, శ్రీనివాస్, కనకరాజు 
పాల్గొన్నారు.

లొంగిపోయిన మావోయిస్టులకు ఇండ్ల పట్టాలు

సిద్దిపేట రూరల్, వెలుగు : గతంలో లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస ఏర్పాటు కింద ఇండ్ల పట్టాలను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శనివారం పంపిణీ చేశారు. లొంగిపోయిన మావోయిస్టులలో రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ కు దుళ్మిట్టలో, ముత్తన్నగారి జలంధర్, కొమ్ముగల్ల లక్ష్మణ్ కు సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి లో ఇండ్ల స్థలాలు కేటాయించినట్లు కలెక్టర్​ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

కాసారంపల్లి గ్రామస్తులకు అండగా ఉంటాం..

అనంతగిరి రిజర్వాయర్ అదనపు టీఎంసీ పనుల వల్ల బ్లాస్టింగ్, దుమ్ము, ధూళితో ఇబ్బంది పడుతున్న చిన్నకోడూరు మండలం ఎల్లాయపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కాసారంపల్లి గ్రామస్తులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. శనివారం కలెక్టర్ ఆఫీస్ లో కాసారంపల్లికి ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి భరోసా ఇచ్చారు. 

సీసీ కెమెరాలతో క్రైమ్ రేట్ తగ్గించొచ్చు 

మెదక్ (నిజాంపేట), వెలుగు: సీసీ కెమెరాలను ఏర్పాటుతో క్రైమ్ రేట్ తగ్గించొచ్చని తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని తిప్పనగుల్ల గ్రామంలో రూ.1.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన దాత గోపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చంద్రవర్దినిని అభినందించారు. కార్యక్రమంలో రామాయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ విజయ్ కుమార్, ఉప సర్పంచ్ సంజీవులు, ఎంపీటీసీ రాజిరెడ్డి
పాల్గొన్నారు.