ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఏఐకేఎస్‌‌‌‌‌‌‌‌ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్‌‌‌‌‌‌‌‌ మొల్ల, ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండలో జరిగిన రైతు సంఘం మహాసభల్లో వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం దక్షిణ భారతదేశంలోనే ఎంతో కీలకమైందన్నారు. రైతు సభ్యత్వాల నమోదు చర్యలు తీసుకోవాలని, ప్రతి రైతు సంఘంలో చేరేలా కృషి చేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం సభ్యత్వ నమోదు పూర్తి కాగానే గ్రామ కమిటీలను ఎన్నుకోవాలని చెప్పారు. రైతు నాయకులు ప్రణాళికాబద్ధంగా, చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. స్వామినాథన్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ సిఫార్సుల అమలు కోసం రైతులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు తీసుకొచ్చిన చట్టాలను అమలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, సూర్యాపేట జిల్లా కార్యదర్శి దండ వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, శెట్టి వెంకన్న, వల్లపు వెంకటేశ్ పాల్గొన్నారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పోతినేని సుదర్శన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా టి. సాగర్, ఉపాధ్యక్షులుగా జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నరసింహారెడ్డి, పి. జంగారెడ్డి, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు ఎన్నికయ్యారు.

 

మీ సేవ సెంటర్లలో సిటిజన్‌‌‌‌‌‌‌‌ చార్ట్‌ తప్పనిసరి

సూర్యాపేట, వెలుగు : మీసేవ సెంటర్లలో తప్పనిసరిగా సిటిజన్‌‌‌‌‌‌‌‌ చార్ట్‌‌‌‌‌‌‌‌ పెట్టాలని సూర్యాపేట అడిషినల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌.మోహన్‌‌‌‌‌‌‌‌రావు ఆదేశించారు. మీ సేవ సెంటర్ల ఆపరేటర్లతో మంగళవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. కొన్ని మీ సేవ సెంటర్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారమే మీ సేవ సెంటర్లను నడిపించాలని ఆదేశించారు. సెంటర్లకు వస్తున్న రైతులకు ధరణి కొత్త మాడ్యూల్స్‌‌‌‌‌‌‌‌పై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌‌‌‌‌‌‌‌, వెంకారెడ్డి, కిశోర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, డీఎస్పీ నాగభూషణం, ఈడీఎం గఫార్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌, మీ సేవ డీఎం సైదానాయక్‌‌‌‌‌‌‌‌, సీఎస్సీ సెంటర్ల ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ చరణ్ పాల్గొన్నారు.

ఆధార్‌‌‌‌‌‌‌‌కు మొబైల్‌‌‌‌‌‌‌‌ లింక్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలి

సూర్యాపేట, వెలుగు : ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌‌‌‌‌‌‌‌ కార్డుకు మొబైల్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌ లింక్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన డిస్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌ ఆధార్‌‌‌‌‌‌‌‌ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016 కంటే ముందు ఆధార్‌‌‌‌‌‌‌‌ కార్డు తీసుకున్న వారు తప్పనిసరిగా అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని, ఇందుకోసం సంబంధిత పేపర్స్‌‌‌‌‌‌‌‌తో మీ సేవ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఎస్.మోహన్‌‌‌‌‌‌‌‌రావు, ఆర్డీవోలు కిశోర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, రాజేంద్రకుమార్, వెంకారెడ్డి, డీడబ్ల్యూవో జ్యోతి పద్మ, డీఎస్పీ నాగభూషణం, ఆధార్‌‌‌‌‌‌‌‌ రీజినల్‌‌‌‌‌‌‌‌ సెక్ష్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ పీఎన్‌‌‌‌‌‌‌‌వీఆర్‌‌‌‌‌‌‌‌.కృష్ణ పాల్గొన్నారు. 


హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తా

చండూరు, వెలుగు : ఉప ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పాలకవర్గంతో మంగళవారం స్థానికంగా మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చండూరు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ అధ్వానంగా మారిందని, పలు వార్డుల్లో మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చండూరు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను 30 పడకల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌గా మార్చేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మరో ఆరు క్లాస్‌‌‌‌‌‌‌‌రూమ్స్‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తామని చెప్పారు. రోడ్డు విస్తరణ చేపట్టడంతో పాటు, డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చండూరులో కోర్టు ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ తోకల చంద్రకళ వెంకన్న, కమిషనర్‌‌‌‌‌‌‌‌ మణికరణ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

 

ముగిసిన ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు


యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఈ నెల 27 నుంచి జరుగుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు మంగళవారం ముగిశాయి. మహాసభల చివరి రోజున సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వడాయిగూడెం చౌరస్తా నుండి సభాస్థలి వరకు నిర్వహించిన బైక్‌‌‌‌‌‌‌‌ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన మహాసభల్లో నాయకులు పలు తీర్మానాలను ఆమోదించారు. అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎండీ.యూసుఫ్, ప్రధాన కార్యదర్శిగా బాలరాజు, ఉప ప్రధాన కార్యదర్శిగా నరసింహ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, ఆహ్వాన సంఘం నాయకులు కళ్లెం కృష్ణ, బొలగాని సత్యనారాయణ, బండి జంగమ్మ, చెక్క వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.