
హైదరబాద్, వెలుగు: యాడ్ టెక్ కంపెనీ బ్రైట్‌కామ్ గ్రూప్‌కు ఈ ఏడాది మార్చితో ముగిసిన ఫైనాన్సియల్ ఇయర్‌లో ఏకంగా రూ.7,396.77 కోట్ల రెవెన్యూ (కన్సాలిడేటెడ్), రూ. 1,370.99 కోట్ల నికర లాభం వచ్చింది. 2021–22 తో పోలిస్తే కంపెనీ రెవెన్యూ 2022–23లో 47.36 శాతం, ప్రాఫిట్ 50 శాతం పెరిగాయి.
కొత్త క్లయింట్లు తోడవ్వడంతో పాటు, డిజిటైజేషన్‌కు ప్రాధాన్యం పెరగడం, కొత్త ప్రొడక్ట్‌లను తీసుకురావడంతో కంపెనీ రెవెన్యూ పెరిగిందని బ్రైట్‌కామ్ గ్రూప్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. 2022–23 లో 260 గ్లోబల్ ఏజెన్సీ రిలేషన్‌షిప్స్‌ను, 15 కొత్త యాడ్ ఏజెన్సీలను ఏర్పాటు చేశామని పేర్కొంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ పెరిగేలా సమర్ధవంతగా పనిచేస్తున్నామని కంపెనీ ప్రకటించింది.