చనిపోయానని ప్రకటించేందుకు అంతా రెడీ చేశారు

చనిపోయానని ప్రకటించేందుకు అంతా రెడీ చేశారు
  • తన ప్రాణం కాపాడేందుకు డాక్టర్లు ఎంతో కృషి చేశారు
  • కరోనా ట్రీట్మెంట్ అనుభవాలు షేర్ చేసుకున్న బ్రిటన్ పీఎం బోరిస్ జానన్స్

లండన్ : కరోనా ను జయించి మళ్లీ విధులకు హాజరవుతున్న బ్రిటన్ పీఎం బోరిస్ జాన్సన్ అసలు బతకడానికి డాక్టర్లే అనుకున్నారంట. ఆయన చనిపోయాడని ప్రకటించేందుకు దాదాపు అంతా రెడీ చేశారంట. ఐసీయూలో ట్రీట్ మెంట్ ఇస్తున్న డాక్టర్లు తాను బతుకుతానని అస్సలు ఊహించలేదని బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ తెలిపారు. అవును కరోనాను జయించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఒక విధంగా తనకు ఇది పునర్జన్మ అని చెబుతున్నారు. ఆనాటి ట్రీట్ మెంట్ అనుభవాలను సండే అనే న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. ” కరోనా కు ట్రీట్ మెంట్ తీసుకున్న టైం ఎంతో క్లిష్టమైనది. అంతా నార్మల్ గా జరిగిందని నేను చెప్పలేను” డాక్టర్లు దాదాపు నేను చనిపోతానని భావించారు. స్టాలిన్ చనిపోయినప్పుడు వ్యవహారించిన మాదిరిగా తన మరణాన్ని ప్రకటించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు చేశారు” అని చెప్పారు. నేను ఫిజికల్ గా సరైన కండిషన్ లో లేను కానీ పరిస్థితులు అనుకూలించకపోతే ఏమీ చేయాలన్న ఏర్పాట్లు డాక్టర్లు చేస్తున్నారన్నది నాకు తెలుస్తోంది అని ట్రీట్ మెంట్ సమయంలో తన కండిషన్ గురించి చెప్పుకొచ్చారు. ఐతే అంతా కఠినమైన టైమ్ లోనూ నేను మాత్రం ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతానని ఆలోచించేవాడినే తప్ప.. చనిపోతానని మాత్రం అనుకోలేదని బోరిస్ తెలిపారు. డాక్టర్లు తనను బతికించేందుకు చేసిన కృషిని ఎప్పటికీ మరిచిపోలేనని లీటర్ల కొద్దీ ఆక్సిజన్ ను తనకు ఎక్కించారని గుర్తు చేసుకున్నారు. మార్చి 27 న కరోనా లక్షణాలు కనిపించటంతో బోరిస్ వారం రోజుల పాటు ఐసోలేషన్ కు వెళ్లారు. కరోనా ఎఫెక్ట్ ఎక్కువ కావటంతో ఏప్రిల్ 5 న ఆయనను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో 24 గంటల్లోనే ఆయనను ఐసీయూలో చేర్చారు. దాదాపు మూడు రోజుల పాటు ఐసీయూలోనే ట్రీట్ మెంట్ తీసుకున్నారు. ఏప్రిల్ 12 న క్యూర్ కావటంతో హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. కరోనా కు ట్రీట్ మెంట్ కోసం హాస్పిటల్ లో జాయిన్ అవటానికి తాను నిరాకరించానని కానీ ఆక్సిజన్ లెవల్స్ తగ్గటంతో డాక్టర్లు బలవంతంగా తనను ఐసీయూలో చేర్చారని బోరిస్ చెప్పారు. ఆనాడు డాక్టర్లు చేసిన పని సరైందేనని ఇప్పుడు అనిపిస్తుందనన్నారు. ట్రీట్ మెంట్ టైమ్ చాలా ఫ్రస్ట్రేషన్ కు గురైనట్లు బోరిస్ వెల్లడించారు.
కుమారునికి డాక్టర్ల పేరు
చావు నుంచి తనను రక్షించిన డాక్టర్ల పై బోరిస్ కృతజ్ఞత చాటుకున్నారు. ఇటీవ‌లే పుట్టిన‌‌ కుమారుడికి త‌న‌కు ట్రీట్ మెంట్ అందించిన డాక్టర్స్ పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని భార్య సీమండ్స్ వెల్లడించారు. డాక్టర్లతోపాటు తమ పూర్వీకులు పేర్లు కలిసి వచ్చేలా విల్‌ఫ్రెడ్ లౌరీ నికోలస్ జాన్సన్ అని కుమారుడి పేరు పెట్టారు. బోరిస్ తాత విల్‌ఫ్రెడ్.. సీమండ్స్ తాత లౌరీ.. జాన్సన్‌కు ట్రీట్మెంట్ అందించిన‌ డాక్టర్లు నిక్ ప్రైస్, నిక్ హర్ట్.. ఇలా నలుగురి పేర్లు కలిసొచ్చేలా కుమారుడికి పెట్టినట్టు వివరించారు.