క్వీన్ ఎలిజబెత్ పుట్టిన రోజున.. మనోళ్లకు అవార్డులు

క్వీన్ ఎలిజబెత్ పుట్టిన రోజున.. మనోళ్లకు అవార్డులు


లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 పుట్టినరోజు సందర్భంగా 30 మంది ఇండియన్ మూలాలనున్న వ్యక్తులను యూకే ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఏటా జూన్ 12న రాణి పుట్టిన రోజు సందర్భంగా ‘క్వీన్స్ బర్త్ డే హానర్స్ లిస్టు’ను ప్రకటిస్తుంటారు. ఈ ఏడాది కరోనా విపత్తు టైంలో ప్రజలకు విశేష సేవలు అందించిన ఇండియన్ సంతతి వ్యక్తులు పలు కేటగిరీల్లో అవార్డులు అందుకున్నారు. కోల్​కతాలో పుట్టి, లండన్​లో సెటిల్ అయిన దివ్యా చద్ధా మానెక్ ఆర్డర్ ఆఫ్​ది బ్రిటిష్ ఎంపైర్(ఓబీఈ) పురస్కారం పొందారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్ లో బిజినెస్ డెవలప్​మెంట్ డైరెక్టర్​గా ఉన్న ఆమె వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ లో కీలక సేవలు అందించారు. సిఖ్ రికవరీ నెట్ వర్క్ చైర్మన్ జస్వీందర్ సింగ్ రాయ్, లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూపునకు చెందిన జస్ జ్యోత్ సింగ్, తదితరులు కూడా ఓబీఈ పురస్కారం అందుకున్నారు. వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్​లో బిజినెస్, ఎనర్జీ, ఇండస్ట్రియల్ స్ట్రాటజీ డిపార్ట్​మెంట్ నుంచి సేవలందించిన దేవినా బెనర్జీ, పోర్ట్స్ మౌత్ హాస్పిటల్స్ యూనివర్సిటీ ఎన్​హెచ్ఎస్ ట్రస్ట్ డైరెక్టర్ అనూప్ జీవన్ చౌహాన్, గ్లౌస్ స్టెర్ షైర్ హాస్పిటల్స్ డాక్టర్ అనంతక్రిష్ణన్ రఘురాం, తదితరులు మెంబర్స్ ఆఫ్ ​బ్రిటిష్ ఎంపైర్(ఎంబీఈ) అవార్డును స్వీకరించారు.