పవన్ దెబ్బకు యూట్యూబ్ షేక్.. ట్రెండింగ్లో బ్రో ట్రైలర్

పవన్ దెబ్బకు యూట్యూబ్ షేక్.. ట్రెండింగ్లో బ్రో ట్రైలర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Powerstar Pawan kalyan) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ బ్రో(Bro). మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్(sai dharam tej) కీ రోల్ లో కనిపించనున్న ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. నటుడు, దర్శకుడు సముద్రఖని(Samutirakhani) దర్శకత్వం వహించిన ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేసిన ఈ ట్రైలర్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇద్దరు మెగా హీరోలు కలిసి నటించడం, చాలా రోజుల తరువాత పవన్ నుండి వస్తున్న సినిమా కావడంతో.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లే రేంజ్ లో ట్రైలర్ ఉండటంతో.. టాప్ వ్యూస్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది బ్రో ట్రైలర్. విడుదలైన 24 గంటలు కాక ముందే 14 మిళియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అంతేకాదు నిమిష నిమిషానికి ఈ కౌట్ పెరుగుతూనే ఉంది. 

దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇక బ్రో సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సాయి ధరమ్ కు జోడీగా కేతిక శర్మ(Kethika sharma) నటిస్తుండగా.. మరో కీ రోల్ లో ప్రియా ప్రకాష్(Priya prakash) నటిస్తోంది. మరి ట్రైలర్ తోనే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ.. రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.