
న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్ టేబుల్ టెన్నిస్ టీమ్ బ్రిక్స్ గేమ్స్‌లో సత్తా చాటింది. రష్యాలోని కజన్‌లో జరిగిన ఈ టోర్నీలో పొయమంతీ బైశ్య, మౌమితా దత్త, యశిని శివశంకర్‌తో కూడిన జట్టు బ్రాంజ్ మెడల్ నెగ్గింది. శుక్రవారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో ఇండియా 1–3తో చైనా చేతిలో ఓడి బ్రాంజ్‌తో తిరిగొచ్చింది. కాగా, హైదరాబాదీ సురావజ్జుల స్నేహిత్, అనిర్బన్ ఘోశ్, జీత్ చంద్రతో కూడిన మెన్స్ టీమ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో 3–1తో బహ్రెయిన్‌పై గెలిచి ఐదో స్థానం సాధించింది.