బీజేపీ నేతలపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి

బీజేపీ నేతలపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల గ్రామంలో బీజేపీ నాయకులపై బీఆర్ఎస్ కార్యకర్తలు కర్రలు, కుర్చీలతో దాడి చేశారు. బీజేపీ కార్నర్ మీటింగులో మాట్లాడుతున్న ఆ పార్టీ గిరిజన మెర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్, స్థానిక బీజేపీ ఎంపీటీసీ మదన్ పై అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు. ‘నైనాల గ్రామం ఎమ్మెల్యే శంకర్ నాయక్ అడ్డా’ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు హల్ చల్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరగింది. దీంతో నైనాల గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో నెల్లికుదురు పోలీసులు నైనాల గ్రామానికి వెళ్లారు. కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని.. విచారిస్తున్నారు.