పార్లమెంట్ ఎదుట బీఆర్ఎస్, ఆప్ ఎంపీల ఆందోళన

పార్లమెంట్ ఎదుట బీఆర్ఎస్, ఆప్ ఎంపీల ఆందోళన

దర్యాప్తు  సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందంటూ బీఆర్ఎస్, ఆప్ ఎంపీలు పార్లమెంట్ భవనం ఎదుట ఆందోళన చేపట్టారు. కేంద్రం దాదాగిరి చెల్లదంటూ ఎంపీలు స్లోగన్లు వినిపించారు.  ఆదానీపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై జాయింట్  పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లోక్ సభ, రాజ్యసభలో నిరసన తెలుపుతామన్నారు. పార్లమెంట్ లోఅనుసరించాల్సిన వ్యూహంపై 16 ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేకంగా సమావేశం కాగా బీఆర్ఎస్ మాత్రం హాజరుకాలేదు. మరోవైపు పార్లమెంట్ రెండో విడత సమావేశాలు మొదలయ్యాయి. ఏప్రిల్ ఆరుతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.