
- కేసీఆర్2018లో బీజేపీ నేతలను ప్రగతిభవన్‌కు పిలిచారని వ్యాఖ్య
- బీఎల్సంతోష్ను అరెస్ట్‌చేసే దమ్ముందా? అంటూ ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌పార్టీని దెబ్బ తీసేందుకు బీఆర్ఎస్, బీజేపీలు కలిసి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని పీసీసీ చీఫ్రేవంత్రెడ్డి ఆరోపించారు. రెండు రోజుల నుంచి ప్రధాని మోదీ, మంత్రి కేటీఆర్వ్యాఖ్యలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతున్నదని చెప్పారు. అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ గురువారం రేవంత్ నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. కేసీఆర్సీఎం అయినప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా మోదీని పొగుడుతూనే ఉన్నారని విమర్శించారు. మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయానికీ కేసీఆర్మద్దతిచ్చారని గుర్తు చేశారు. 2016లో మిషన్ భగీరథ ప్రారంభోత్సవంలో మోదీని కేసీఆర్పొగిడారన్నారు. మోదీ ప్రభుత్వం అత్యంత ప్రగతిశీలమైనదని, రాష్ట్రాలకు అనుకూలంగా ఉంటుందని గతంలో కేసీఆర్అన్నారని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి వారి మధ్య బంధం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. నోట్ల రద్దుపై దేశమంతా గగ్గోలు పెడితే.. కేసీఆర్‌మాత్రం పూర్తిగా మద్దతు తెలిపారన్నారు.
ప్రగతిభవన్వేదికగా కుట్ర
2018 ఆగస్టులో అసెంబ్లీని రద్దు చేస్తారన్న చర్చ జరుగుతున్న టైమ్‌లో ఢిల్లీకి వెళ్లి వచ్చిన కేసీఆర్.. బీజేపీ నేతలను ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారని, ఏ నేతకూ అపాయింట్మెంట్ఇవ్వలేదని రేవంత్అన్నారు. ‘‘మాజీ ప్రధాని వాజ్‌పేయి స్మృతి వనం ఏర్పాటు చేసేందుకు స్థల కేటాయింపునకు విజ్ఞప్తి చేశామని అప్పుడు బీజేపీ నేతలు చెప్పారు. కానీ, దాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు ప్రగతిభవన్వేదికగా బీఆర్ఎస్, బీజేపీ కుట్ర పన్నాయి. లేకపోతే ఐదేండ్లు గడుస్తున్నా ఏ ఒక్కరూ వాజ్‌పేయి స్మృతి వనం ఏర్పాటు గురించి మాట్లాడటం లేదు. హంగ్‌వస్తే బీఆర్ఎస్కే మద్దతిస్తామంటూ 2018 ఎన్నికల టైమ్‌లో అప్పటి బీజేపీ రాష్ట్ర చీఫ్ లక్ష్మణ్వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, బీజేపీ బంధానికి ఆ వ్యాఖ్యలే నిదర్శనం’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తున్నదని, ఆరు గ్యారెంటీలతో జనం కాంగ్రెస్పార్టీవైపు చూస్తున్నారని తెలిపారు.
కేసీఆర్.. ఆ కేసు యాదికున్నదా?
బీఆర్ఎస్ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదంటూ తెలంగాణ ప్రజలకు పెట్టుకున్న మొర యాదికున్నదా అంటూ కేసీఆర్‌ను రేవంత్‌ప్రశ్నించారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా అంటూ ఓ ట్వీట్లో ప్రశ్నించారు. ‘‘ఆ కేసు(ఫౌం హౌస్) ఏడాది కావొస్తున్న శుభసందర్భంలో.. మీ సర్కారును కూలదోస్తామన్న కుట్రదారు బీఎల్ సంతోష్ హైదరాబాద్వచ్చారట కదా. ఇన్నాళ్లూ అడ్రస్దొరకలేదని తప్పించుకుంటిరి.. మరి, ఇప్పుడైనా ఆయనను అరెస్ట్ చేసే దమ్ముందా? ఆ కట్టు కథను ప్రజలు మరచిపోతారులే అని ఆతిథ్యమిస్తారా? లేక సిట్‌ను నిద్రలేపి అరెస్టు చేస్తారా? మీ సమాధానం కోసం తెలంగాణ చూస్తున్నది’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.