ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి..యువత, మహిళలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పిలుపు

ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి..యువత, మహిళలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పిలుపు
  •     కాంగ్రెస్​లో చేరిన బీఆర్​ఎస్, బీజేపీ నేతలు

రాయికల్, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ​సర్కార్​కు యువత, మహిళలు మద్దతుగా నిలవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​ కుమార్​ కోరారు. రాయికల్ లోని గుడేటి రెడ్డి సంఘ ఆవరణలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత పడిగెల నరసింహ, బీజేపీ నాయకుడు కొత్తపెల్లి అరవింద్​ తమ 40 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్​లో చేరారు. పార్టీ మండల శాఖ అధ్యక్షులు రవిందర్​రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి బండ శంకర్​పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వం పేదల అభివృద్ధి జరుగుతోందని, సంక్షేమ పథకాలు సమానంగా అందుతున్నాయని అందుకే మహిళలు, యువత కాంగ్రెస్​ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం విద్య, వైద్యానికి హబ్​గా మారిందన్నారు. రూ.232కోట్లతో నూతన ఆస్పత్రి నిర్మాణ పనులు జరుగుతున్నాయని, త్వరలో ప్రారంభమయ్యే ఇంటిగ్రేటెడ్​ స్కూల్​లో 25వందల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనున్నదని చెప్పారు. మున్సిపల్​ మాజీ చైర్​పర్సన్ మోర హన్మండ్లు, వైస్​చైర్​పర్సన్​ గండ్ర రమాదేవి, సింగిల్​ విండో చైర్మన్​ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.