హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేశ్ రాథోడ్ అన్నారు. అలాగే, సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ట్రై చేస్తున్నారని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాది దేవుడి పార్టీ అని, ఆయన ఆశీస్సులు ఉంటే తనకు ఎంపీ టికెట్ వస్తుందని చెప్పారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోతే బీజేపీలోనే ఉంటానని, కాంగ్రెస్‌లో చేరబోనన్నారు.
