పనాజీ: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్.. ఫిడే వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్‌ను డ్రాతో ఆరంభించాడు. . సోమవారం (నవంబర్ 17) వీ యి (చైనా)తో జరిగిన క్వార్టర్స్ తొలి రౌండ్ గేమ్‌ను అర్జున్ 31 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. దీంతో ఇద్దరూ పాయింట్‌ను పంచుకున్నారు. నల్ల పావులతో ఆడిన ఇండియన్ ప్లేయర్ ఆరంభం నుంచి దూకుడుగా వ్యవహరించాడు.
దీంతో మ్యాచ్ 59 నిమిషాల్లోనే ముగించాడు. కీలక టైమ్‌లో బిషప్‌ను చేజార్చుకున్న అర్జున్ నల్ల పావులతో గేమ్ గెలవడం అసాధ్యమని తేలడంతో 27వ ఎత్తు వద్ద డ్రా వైపు మళ్లించాడు. జావోకిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్).. జోస్ మార్టినెజ్ (మెక్సికో), సామ్ శాక్లాండ్ (అమెరికా).. ఆండ్రీ ఎసిపెంకో (రష్యా) మధ్య జరిగిన గేమ్‌లు డ్రా కాగా, నొడిర్బెక్ యాకుబోవ్ (ఉజ్బెకిస్తాన్).. అలెగ్జాండర్ డొంచెకోవ్ (రష్యా)పై గెలిచాడు.
