హైదరాబాద్, వెలుగు: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై బీఆర్‌ఎస్ నేతలు స్పందించారు. ఇది విద్యార్థులు, యువత పోరాట విజయమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో స్పందిస్తూ.. అధికారంలో ఉన్న వారి కంటే ప్రజల శక్తి గొప్పదని అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఇది కచ్చితంగా విద్యార్థుల విజయమని, ప్రజల స్వరం మారుతోందని ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థులు, యువత, ప్రజాస్వామ్యవాదుల విజయమన్నారు. విద్యార్థులు, యువత పోరాటం చేస్తే ఎంతటి మార్పు వస్తుందో దేశం మరోసారి చూసిందన్నారు.
