
మాదాపూర్, వెలుగు : శేరిలింగంపల్లి సెగ్మెంట్లో జరిగిన అభివృద్ధిని చూసి తనను మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ కోరారు. శనివారం హఫీజ్ పేట డివిజన్, కూకట్ పల్లి డివిజన్ లోని పలు కాలనీల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. .