రెండు రోజుల్లో టీవీ ఛానళ్లకు వెళ్తా.. కాళేశ్వరం గురించి వివరిస్తా:కేసీఆర్

రెండు రోజుల్లో టీవీ ఛానళ్లకు వెళ్తా.. కాళేశ్వరం గురించి వివరిస్తా:కేసీఆర్

కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరించేందుకు రెండు  రోజుల్లో ప్రజల ముందుకు వస్తానన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రెండు రోజుల్లో టీవీల్లో ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలు చెబుతున్నారు. కరీంనగర్ కదన భేరి సభలో పాల్గొన్నారు కేసీఆర్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఓ భాగమేనని.. కాళేశ్వరం ప్రాజెక్టులో 300 పిల్లర్లు ఉంటే.. రెండు పిల్లర్లు కుంగితే రాద్ధాతం చేసి నాపేరు బద్నాం చేసే పని గట్టుకున్నారని అన్నారు కేసీఆర్. 

సీఎం హామీల గురించి అడిగితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నేను సీఎం ఉన్నప్పుడు ఎప్పుడూ దురుసుగా మాట్లాడలేదన్నారు కేసీఆర్. మాకన్నా బాగా పనిచెయ్ .. ఇష్టమొచ్చిన్టలు మాట్లాడొద్దన్నారు కేసీఆర్. కరోనా సమయంలో కూడా రైతు బంధు ఇచ్చామన్నారు. చెప్పినట్లుగానే ఇంటింటికి నీళ్లు ఇచ్చామన్నారు. అప్పట్లో తెలంగాణ వస్తుందంటే ఎవరూ నమ్మలేదు.. నాటి పోరాటంలో కొందరు మాత్రమే కలిసొచ్చారని కేసీఆర్అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో  అందరికి తెలుసన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు మోసపోయి కాంగ్రెస్ ను గెలిపించారని కేసీఆర్ అన్నారు.