
జీడిమెట్ల, వెలుగు: కాంగ్రెస్పాలనకు బీఆర్ఎస్నేతలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని కుత్బుల్లాపూర్ఇన్చార్జ్ కొలను హనుమంతరెడ్డి అన్నారు. నిజాంపేట్కార్పొరేషన్పరిధిలో బీఆర్ఎస్నుంచి బాచుపల్లి కార్పొరేటర్ కొలను వీరేందర్‌రెడ్డి , మాజీ వైస్‌ఎంపీపీ కొలను కృష్ణారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సుధీర్‌రెడ్డి, కొలను బాల్‌రెడ్డి, 18వ వార్డు అధ్యక్షుడు రాజేందర్‌తోపాటు పలువురు మంత్రి తుమ్మల నాగేశ్వరావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఆయన అభినందించారు. ఎంపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్‌ను గెలిపిస్తామన్నారు.