హస్తం గూటికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు

హస్తం గూటికి బీఆర్ఎస్  కార్పొరేటర్లు

అసెంబ్లీ ఎన్నికల వేళ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇలాకాలో అధికార బీఆర్ఎస్  పార్టీకి  బిగ్ షాక్  తగులుతుంది. మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన  బీఆర్ఎస్ కార్పొరేటర్లు  ఒక్కొక్కరిగా కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు.

మొన్న  32వ డివిజన్  కార్పొరేటర్ వేముల నరసింహ, 45వ డివిజన్ కార్పొరేటర్ అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్,  కో ఆప్షన్ మెంబర్ వేముల ఎల్లమ్మ, తాజాగా 43 వ డివిజన్ కార్పొరేటర్ గజ్జల రామచందర్ కాంగ్రెస్ లో చేరారు.  మరికొందరు త్వరలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.  వరుసగా కార్పొరేటర్లు పార్టీని వీడడంతో ఉన్న ఒక కార్పొరేషన్ చేజారే పరిస్థితి నెలకొంది.