భూకబ్జా కేసు కొట్టేయండి .. హైకోర్టులో గండ్ర వెంకటరమణారెడ్డి పిటిషన్‌‌

భూకబ్జా కేసు కొట్టేయండి .. హైకోర్టులో గండ్ర వెంకటరమణారెడ్డి పిటిషన్‌‌

హైదరాబాద్, వెలుగు: భూపాలపల్లి పోలీసులు తమపై పెట్టిన భూకబ్జా కేసును కొట్టేయాలంటూ బీఆర్‌‌ఎస్‌‌ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జ్యోతి చంద్ర, గండ్ర గౌతంరెడ్డి హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. ఎల్‌‌. రాజలింగమూర్తి ఇచ్చిన ప్రైవేటు ఫిర్యాదు మేరకు కింది కోర్టు ఆదేశాలతో పోలీసులు నిరాధార కేసు నమోదు చేశారని తెలిపారు.

పుల్లూరి రామలింగయ్యపల్లి రెండెకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించామని తమపై తప్పుడు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఆధారాలు లేకపోయినా కేసు పెట్టారని వారు పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను హైకోర్టు గురువారం విచారించనుంది.