బీఆర్ఎస్ కు దడపుడుతోంది : మంత్రి పొన్నం

బీఆర్ఎస్ కు దడపుడుతోంది : మంత్రి పొన్నం

కాళేశ్వరం ప్రాజెక్టు పై విజిలెన్స్ విచారణ జరిగితే బీఆర్ఎస్ కు దడ పుడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.  కరీంనగర్ లో స్థానిక నేతలతో కలిసి పొన్నం మార్నింగ్ వాక్ కు వెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 9 నెలలు కూడా పనిచేయలేదని విమర్శించారు. ప్రాజెక్టు అక్రమాల పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పామని ఈ క్రమంలో బీఆర్ఎస్ ను కాపాడేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

తాము అధికారంలోకి వచ్చి  నెలరోజులు అవుతుందని గ్యారెంటీ స్కీమ్ లపై ధరఖాస్తులు స్వీకరించామని మంత్రి పొన్నం చెప్పారు. చిత్తశుద్ధితో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. మాజీ ఎంపీ వినోద్ కు చిత్త శుద్ది ఉంటే తన పై వచ్చిన ఆరోపణల పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. జెన్కో తోపాటు ఇతర డిపార్ట్మెంట్లలో అక్రమంగా ఉద్యోగం పొందిన వారు వెంటనే ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్ళాలని సూచించారు. భూ అక్రమాలపై చర్యలు చేపడుతామని అన్నారు. ఉన్నోళ్లకే పథకాలు ఇవ్వొద్దని.. పేదళ్లకు ఇవ్వాలని మంత్రి సూచించారు.