24X7 షాపులు ఓపెన్.. ఏడాదికి రూ.10 వేల అదనపు ఫీజు  

24X7 షాపులు ఓపెన్.. ఏడాదికి రూ.10 వేల అదనపు ఫీజు  

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో షాపుల టైమింగ్స్​కు సంబంధించి ప్రభుత్వం కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఇకపై అన్ని షాపులూ 24 గంటలూ ఓపెన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌‌మెంట్ యాక్ట్ 1988లోని సెక్షన్ 7 ప్రకారం లైసెన్స్ పొందిన షాపులు 24 గంటలు ఓపెన్ చేసుకోవచ్చని, ఇందుకోసం ఏడాదికి రూ.10 వేల చొప్పున అదనపు ఫీజు చెల్లించాలని ప్రభుత్వం వెల్లడించింది.  ఈ మేరకు ఈ నెల 4నే కార్మిక శాఖ జీవో విడుదల చేసింది. అయితే 11 కండిషన్లు పెట్టిన సర్కార్.. అవి పాటిస్తేనే ఈ వెసులుబాటు లభిస్తుందని జీవోలో పేర్కొంది. 

ఇవీ కండిషన్లు..  

అదనపు పని గంటలకు గాను ఉద్యోగులకు ఓవర్ టైమ్ జీతం చెల్లించాలి. ప్రభుత్వ సెలవులు, వీక్లీ ఆఫ్ రోజు సిబ్బంది పని చేస్తే.. దానికి బదులుగా మరో రోజు సీ-ఆఫ్ తీసుకునే అవకాశం కల్పించాలి. దుకాణాల్లో పనిచేసే మహిళలకు తగిన భద్రత కల్పించాలి. మహిళల అనుమతితోనే వాళ్లకు నైట్​ షిప్ట్​ వేయాలి. వాళ్లకు ట్రాన్స్ పోర్టు సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు షాపు రికార్డులను మేనేజ్ మెంట్ సమర్పించాలి. పోలీసు యాక్టులోని నిబంధనలకు అనుగుణంగా దుకాణాలను నడపాలి.