అప్పట్లో కేసీఆర్ సకాలంలో యూరియా తెప్పిస్తుండె : కేటీఆర్

అప్పట్లో కేసీఆర్ సకాలంలో  యూరియా తెప్పిస్తుండె :  కేటీఆర్
  • మాజీ మంత్రి కేటీఆర్​ వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతున్నదని  బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ సర్కార్ పతనం మొదలైందని శుక్రవారం ఓ ప్రకటనలో దుయ్యబట్టారు.  ‘‘పరిపాలన అంటే ఏంటో తెలియని అసమర్థులు రాజ్యమేలడం వల్లే రైతులకు కష్టాలు, కన్నీళ్లు. కేసీఆర్ నాయకత్వం, ముందుచూపు ఇప్పుడు తెలంగాణ సమాజానికి అర్థమైంది.  బూతులు మాట్లాడడం తప్ప చేతలు రాని ఢిల్లీ పార్టీల నాయకులకు.. కేసీఆర్ వందేండ్ల విజన్​కు తేడా ప్రజలకు అర్థమైంది” అని పేర్కొన్నారు.