అధికార పార్టీ లీడర్లతో సహా మీటింగ్​ను బైకాట్​ చేసిన  మిగిలిన లీడర్లు

అధికార పార్టీ లీడర్లతో సహా మీటింగ్​ను బైకాట్​ చేసిన  మిగిలిన లీడర్లు
  •     కోతులు, కుక్కల నివారించాలని నిరసన

ఖానాపూర్, వెలుగు:  పట్టణంలో కోతులు, కుక్కలు, పందుల సమస్య పెరుగుతోందని, వాటిని నివారించడంలో మున్సిపల్​ చైర్మన్​ నిర్లక్ష్యంగా ఉన్నారని నిరసిస్తూ శనివారం జరగాల్సిన మున్సిపల్​ బడ్జెట్​ మీటింగ్​తో సొంతపార్టీ కార్పొరేటర్లతో సహా ఎవరూ హాజరు కాలేదు.  వీటితో పాటు స్థానిక సమస్యలు పరిష్కరించడంలో  మున్సిపల్ చైర్మన్,   కమిషనర్​  స్పందించడం లేదని  కాంగ్రెస్,  బీజేపీ కౌన్సిలర్లు   అంటున్నారు.   చైర్మన్ అంకం రాజేందర్  అధ్యక్షతన  మున్సిపల్ ఆఫీసులో  సమావేశం జరగాల్సింది.  కాగా చైర్మన్ , కమిషనర్  మాత్రమే హాజరై దాదాపు గంటకు పైగా కౌన్సిలర్ల కోసం ఎదురు చూశారు. కౌన్సి లర్లు ఎవరు కూడా హాజరు కాకపోవడంతో  కోరం లేక  సమావే శాన్ని  కమిషనర్  చిక్యాల రత్న కర్ రావ్ వాయిదా వేశారు. ఇలా ఉండగా కాంగ్రెస్  ఫ్లోర్  లీడర్ రాజుర సత్యం, బీజేపీ , కాంగ్రెస్ నాయకులు  నాయిని సంతోష్, షబ్బీర్ పాషా లు  మాట్లాడుతూ పట్టణంలోని  ఏ ఒక్క సమస్యను కూడా మున్సిపాలిటీ  తీర్చలేక పోతుందని  ఆరోపించారు  అలాగే మున్సిపాలిటీకి వస్తున్న నిధుల విషయంలో కూడా అధికారులు స్పష్టతనివ్వడం లే దన్నారు.

తాము  ఇప్పటికే  చాలాసార్లు ఎన్ని నిధులు వచ్చాయో.. ఎంత మేరకు ఖర్చు చేశారో ననే  అంశంపై  వివరాలు కోరినప్పటికీ అధికారులు మాత్రం ఆ విషయాన్ని దాటవేస్తూ నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారని  మండిపడ్డారు. గత మూడు సంవత్సరాల బడ్జెట్ ఖర్చు వివరాలు తాము కోరుతున్నామన్నారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశం తో కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొ న్నా రు.  పట్టణంలో జరుగుతున్న రోడ్డు వెడల్పు కార్యక్రమం నత్త నడ కన జరుగుతుందనీ తెలిపారు. ముఖ్యంగా  మున్సిపల్ చైర్మన్ నిర్ల క్ష్య ధోరణి  అవలంబిస్తున్నారని  ఆరోపించారు. కాగా ఈ బడ్జెట్ మీ టింగ్ కు  అధికార  బీఆర్ఎస్  పార్టీ కు చెందిన 5 గురు  కౌన్సిలర్లు మున్సిపల్  గైర్హాజరు కావడం కోసం మెరుపు.

నిర్మల్ మున్సిపల్ బడ్జెట్ ఆమోదం 

నిర్మల్  : నిర్మల్ మున్సిపాలిటీకి  2023– 24 ఆర్థిక సంవత్సరానికి   రూ. 80 కోట్ల 24 లక్షల  బడ్జెట్ ను  మున్సిపల్ పాలకవర్గం ఆమోదించింది. శనివారం  మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అధ్యక్షతన   సమావేశానికి కలెక్టర్ వరుణ్ రెడ్డి, కమిషనర్ రాజు, కౌన్సిలర్లు హాజరయ్యారు.  కలె క్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ  పారిశుధ్య  నిర్వహణ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  మున్సిపల్ వ్యయం  పెరిగిందని, ఆదాయ  వనరుల  పై దృష్టి సారించాలని కో రారు.