మల్లారెడ్డి నివాసంలో దాడులను ఖండించిన బీఆర్ఎస్ నాయకులు

మల్లారెడ్డి నివాసంలో దాడులను ఖండించిన బీఆర్ఎస్ నాయకులు

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో నిన్నటి నుండి ఐటీ దాడుల నేపథ్యంలో కీసర మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలి వద్ద మండల బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు.  ఈ క్రమంలో ప్రధాన మంత్రి డౌన్ డౌన్ అంటూ కీసర ప్రధాన కూడలిలో మోడీ దిష్టి బొమ్మ దహనం చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కీసర పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. అయితే బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తున్న సమయంలోనే అక్కడికి వచ్చిన ఓ మహిళ కేసీఆర్ కి ఏమైంది...  ఎందుకు ధర్నా చేస్తున్నారు అంటూ మండిపడింది. 

ఎలాంటి నోటీసులు లేకుండా ఏకకాలంలో ఐటీ దాడుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. బీజేపీ నేతలు కావాలనే కక్ష్యపూరితంగా ఈ రకమైన పనులు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ తో పెట్టుకోవద్దని నేతలు అన్నారు. తాము ఏ దాడులు చేసినా భయపడమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఐటీ దాడులను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. మోడీ చేసే పనులు అందరూ గమనిస్తున్నారని, రాబోయే కాలంలో బీజేపీకి పుట్టగతులుండవన్నారు.