జహీరాబాద్ లో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు

జహీరాబాద్ లో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు

జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. మంగళవారం హైదరాబాద్​లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహా ల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ కు చెందిన రాష్ట్ర ఐడీసీ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్, జహీరాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ మంఖాల్ సుభాష్, ఇప్పేపల్లి మాజీ సొసైటీ చైర్మన్ కిషన్ పవర్, జహీరాబాద్  మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు, మైనారిటీ నాయకులు కాంగ్రెస్ లో జాయిన్​ అయ్యారు. 

వారందరికీ సీఎం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ కుమార్ షెట్కార్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఉజ్వలరెడ్డి పాల్గొన్నారు .