బస్సు చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: ఆర్టీసీ ఎండీకి బీఆర్ఎస్ నేతల వినతి

బస్సు చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: ఆర్టీసీ ఎండీకి బీఆర్ఎస్ నేతల వినతి

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఛలో బస్ భవన్ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా గురువారం (అక్టోబర్ 09) ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో పలువురు నేతలు RTC MD నాగిరెడ్డిని కలిశారు. బస్ టికెట్ల చార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా ఆర్టీసీకి ప్రభుత్వ బకాయిలపై వివరాలు అడిగి తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు.. ప్రస్తుత ప్రభుత్వం ఆర్టీసీని ముంచేలా కుట్ర చేస్తోందని విమర్శించారు.