ఓటరు జాబితా సవరణ వాయిదా వేయండి ..ఎన్నికల కమిషనర్కు బీఆర్ఎస్ లేఖ

ఓటరు జాబితా సవరణ  వాయిదా వేయండి ..ఎన్నికల కమిషనర్కు బీఆర్ఎస్ లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్​ను బీఆర్ఎస్​పార్టీ కోరింది. ఈ మేరకు గురువారం బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్​రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు లేఖ రాశారు.

 భారీ వర్షాలతో ప్రజలు తమ ప్రాణాలు, ఆస్తులు, పంటలను కాపాడుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారని.. వాళ్లు ఓటర్ జాబితాలో తమ వివరాలను తెలుసుకునే అవకాశం లేదన్నారు. రాబోయే 3 నుంచి 5 రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, ఈ ప్రక్రియలో ప్రజలు, అధికారులు పాల్గొనడం అసాధ్యమన్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నందున, వారికి ఎన్నికల విధులు అప్పగించడం సరికాదన్నారు.