పోడు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్‌‌దే : భాస్కరరావు

పోడు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్‌‌దే : భాస్కరరావు
  • బీఆర్‌‌ఎస్‌ మిర్యాలగూడ అభ్యర్థి భాస్కరరావు

మిర్యాలగూడ,  వెలుగు :  గిరిజనులకు పోడుపట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌‌దేనని బీఆర్‌‌ఎస్‌ మిర్యాలగూడ అభ్యర్థి భాస్కరరావు స్పష్టం చేశారు. బుధవారం నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొత్తపేట తండా, దూద్య  తండా, తూర్పు తండా, బాలాజీ నగర్, కాళ్ల వీరప్ప గూడెం, గణేశ్ పహాడ్  గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో ఉన్న తనకు గిరిజన కుటుంబాలతో విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని పల్లెలను, తండాలను అభివృద్ధి చేశానని, తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.

అనంతరం  అడవిదేవులపల్లిలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు.  ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు లొంగకుండా బీఆర్‌‌ఎస్ గెలుపునకు పనిచేయాలని సూచించారు. మళ్లీ అధికారంలోకి వస్తే పదవుల్లో అందరికీ అవకాశాలు ఉంటాయని చెప్పారు. అనంతరం ఇటీవల మృతి చెందిన రిటైర్డ్ టీచర్ రామానుజాచార్యులు సంస్మరణ సభకు హాజరయ్యారు.

అలాగే ఈదులగూడకు  చెందిన 20 బుడగజంగాల కులుంబాలు.. యువనేత సిద్ధార్థ సమక్షంలో బీఆర్‌‌ఎస్‌లో చేరాయి.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీ నాయక్, డీసీఎంఎస్ చైర్మన్ నారాయణరెడ్డి, జడ్పీటీసీ లలిత హథిరాం, నందకిషోర్, సేవ్య నాయక్, సురేశ్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.