విజన్ లేని పార్టీలతో ప్రజలకు నష్టం : భాస్కర రావు

విజన్ లేని పార్టీలతో ప్రజలకు నష్టం : భాస్కర రావు

మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్‌‌, బీజేపీలకు ఎలాంటి విజన్ లేదని, అలాంటి పార్టీలతో ప్రజలకు నష్టం జరుగుతుందని బీఆర్‌‌‌‌ఎస్‌‌ మిర్యాలగూడ అభ్యర్థి  భాస్కర రావు హెచ్చరించారు.  ఆదివారం మిర్యాలగూడ మండలం హట్య తండా, కేశ్య తండా, చింతపల్లి, వాల్య తండా, బొట్య నాయక్ తండా, కేశవ నగర్, వెంకటాద్రిపాలెం, దుర్గా నగర్‌‌‌‌లో ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ విజన్‌‌ ఉన్న లీడర్‌‌‌‌ అని, పక్కా ప్రణాళికతో  సాగునీరు,  24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. పండిన పంటను కూడా మద్దతు ధరకు కొంటున్నారని స్పష్టం చేశారు.  

మిర్యాలగూడ  వరి దిగుబడికి, విక్రయాలకు కేరాఫ్ గా నిలుస్తోందన్నారు. తండాలను జీపీలుగా మార్చి గిరిజనులను పాలకులను చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.   తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన పార్టీ తరఫున పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ నూకల సరళ,  ఏఎంసీ మాజీ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్, మండల అధ్యక్షులు సైదులు యాదవ్, నేతలు ఏడు కొండలు, బారెడ్డి అశోక్ రెడ్డి, బాణావత్ లలిత సక్రు, తాళ్లపల్లి రవి పాల్గొన్నారు.