అభివృద్ధి పనులెన్నో చేశా.. మరోసారి గెలిపించండి : అరికెపూడి గాంధీ

అభివృద్ధి పనులెన్నో చేశా.. మరోసారి గెలిపించండి :  అరికెపూడి గాంధీ

గచ్చిబౌలి, వెలుగు: శేరిలింగంపల్లి సెగ్మెంట్​ను ఎంతో అభివృద్ధి చేశానని.. మరోసారి తనను గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరికెపూడి గాంధీ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గచ్చిబౌలి డివిజన్​లోని గోపన్ పల్లి, వీకర్ సెక్షన్ కాలనీ, మాదాపూర్ డివిజన్​లోని గోకుల్ ఫ్లాట్స్​లో ఇంటింటికి తిరుగుతూ ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అరికెపూడి గాంధీ మాట్లాడుతూ..  ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలన్నారు.

రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని.. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావని ఆయన తెలిపారు. శేరిలింగంపల్లిలో రూ.కోట్ల నిధులతో అభివృద్ధి పనులు  చేపట్టామన్నారు.