బీజేపీ నేతలకు కంటి చూపు మందగించింది : ఎమ్మెల్యే దానం

బీజేపీ నేతలకు కంటి చూపు మందగించింది : ఎమ్మెల్యే దానం

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బీజేపీ నేతల కంటికి కనిపించడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఫిలిం నగర్ లోని గౌతమ్ నగర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడి దానం.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక స్తోమత లేని వృద్ధులకు ఈ కంటి వెలుగు ఎంతో తోడ్పుతుందని అన్నారు. కంటి వెలుగు పథకాన్ని పంజాబ్, ఢిల్లీ సీఎంలు ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నా..అది బీజేపీ నాయకులకు కంటికి కనిపించకపోవడం శోచనీయమని అన్నారు.

బీజేపీ నాయకులకు కంటిచూపు మందగించిందని ఎమ్మెల్యే దానం విమర్శించారు. వారి కోసం ప్రత్యేక కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేశామని.. కంటి పరీక్ష చేసి కళ్లద్దాలు, అవసరమైతే సర్జరీలు కూడా ఉచితంగా చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని దానం నాగేందర్ అన్నారు.