ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ.. పథకాలు రావడం లేదంటూ నిలదీత

ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ.. పథకాలు రావడం లేదంటూ నిలదీత

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఇల్లందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ తగిలింది. ప్రభుత్వ పథకాలు తమకు అందడం లేదంటూ హరిప్రియను సింగారం గ్రామస్తులు నిలదీశారు. ఈ క్రమంలో గ్రామస్తులకు, హరిప్రియకు మధ్య వాగ్వివాదం జరిగింది. అధికార పార్టీ, స్థానిక నాయకులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కొత్తపేట గ్రామంలో తమ ఇల్లు కూలేపోయే స్థితిలో ఉందంటూ ఓ మహిళ ఎమ్మెల్యే హరిప్రియ చేయి పట్టుకుని తమ ఇంటికి తీసుకుపోయింది. తమ పరిస్థితిని తెలియజేసింది. తమకు డబుల్​బెడ్రూమ్ ఇల్లు రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

హరిప్రియ నాయక్ ఎంత వారించినా గ్రామస్తులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రశ్నల వర్షం కురిపించారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సన్న బియ్యం ఇస్తారని ఎమ్మెల్యే హరిప్రియ చెప్పారు.