నా రాజకీయ ప్రస్థానం తెరిచిన పుస్తకం.. ప్రత్యర్థి పార్టీల వ్యాఖ్యలే కవిత కూడా చేసింది: హరీష్ రావు

నా రాజకీయ ప్రస్థానం తెరిచిన పుస్తకం.. ప్రత్యర్థి పార్టీల వ్యాఖ్యలే కవిత కూడా చేసింది: హరీష్ రావు

శంషాబాద్: లండన్ నుంచి తిరిగి వచ్చిన బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు.. తనపై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగగానే మీడియాతో మాట్లాడారు.. అయితే ఈ సందర్బంగా కవిత పేరును కూడా ప్రస్తవించేందుకు ఇష్టపడలేదు హరీష్ రావు. 

నా 25 సంవత్సరాల రాజకీయ జీవితం.. తెరిచిన పుస్తకం.. అది తెలంగాణ ప్రజలకు తెలుసు.. గత కొంతకాలంగా ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలే కవిత కూడా చేసింది... ఆమె చేసిన ఆరోపణలు ఆమె విజ్ణతకే వదిలేస్తున్నానని అన్నారు హరీష్ రావు. 

కేసీఆర్ నాయకత్వంలో గత రెండున్నర దశాబ్దాలుగా క్రమశిక్షణగల నాయకుడిగా నిబద్ధత గల కార్యకర్తగా రాష్ట్ర సాధనలో,రాష్ట్రాభివృద్దిలో తాను చేసిన కృషి, తన పాత్ర తెలంగాణ ప్రజలందరికీ తెలుసని అన్నారు. 

తెలంగాణలో రైతులు ఎరువుల కొరత ఎదుర్కుంటున్నారు..పంటకు సరియైన సమయంలో ఎరువులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు హరీష్ రావు. దశాబ్ద కాలంగా ఒక్కొక్క వ్యవస్థను నిర్మిస్తూ వస్తే.. సీఎం రేవంత్ రెడ్డి వాటిని కూల్చే ప్రయత్నం చేస్తు్న్నారని హరీష్ రావు విమర్శించారు. 

ఇలాంటి పరిస్థితుల్లో  కష్టాల్లో ప్రజలను ఆడుకునేందుకు తామెప్పుడూ ముందుంటామని హరీష్ రావు అన్నారు. తెలంగాణ ద్రోహులనుంచి పార్టీని కాపాడుకునే పనిలోనే మా దృష్టి ఉందని హరీష్ రావు అన్నారు. రాష్ట్ర సాధనలో కృషి చేశాం.. రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్లం.. కాబట్టి మా సమయాన్ని పూర్తిగా అందుకోసమే వినియోగిస్తామని అన్నారు. 

తిరిగి కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీనీ అధికారంలోకి తీసుకు రావడానికి అందరం కలసి కట్టుగా ముందుకు వెళతామని హరీష్ రావు అన్నారు.