ఉద్యమం నుంచి వచ్చిన..కేసులకు భయపడేది లేదు: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

 ఉద్యమం నుంచి వచ్చిన..కేసులకు భయపడేది లేదు:  ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.  బీఆర్ ఎస్ లోకి రాకముందు తాను ఉద్యమంలో జేఏసీతో కలిసి పనిచేశానని చెప్పారు. వేధింపుల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం  తనపై ఆరు నెలల్లో నాలుగైదు కేసులు నమోదు చేసిందన్నారు. తనతో పాటుగా తన భార్య నీలిమ, కొడుకు అనురాగ్ పైన కూడా కేసులు పెట్టారని పల్లా తెలిపారు.  కేసులకు భయపడే వ్యక్తిని తాను కాదన్న పల్లా..  న్యాయ పోరాటం చేస్తానన్నారు.  ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.   తెలంగాణలో  కాంగ్రెస్ నేతలు కక్షపూరిత రాజకీయాలను ప్రారంభించారని మండిపడ్డారు. అనాడు ఉమ్మడి పాలకులు కేసులు పెట్టారని.. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసులు నమోదు చూస్తున్నామన్నారు.   రాజకీయాల్లో విలువలు పాటించాలని.. గెలిచిన పార్టీలోనే ఐదేండ్లు ఉండాలని పల్లా చెప్పారు.  ఇప్పటి వరకు తెలంగాణలో ఇలాంటి వాతావరణం చూడలేదని  చెప్పారు.