- ఈ విషయాన్ని కేసీఆర్ ముందే చెప్పారు
- ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్
కాగజ్ నగర్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాడర్ ను గందరగోళం చేసేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ మండిపడ్డారు. సిట్ నోటీసులు ఇచ్చే విషయాన్ని కేసీఆర్ తమతో ముందే చెప్పారని అన్నారు. మున్సిపల్ ఎలక్షన్ ఆసిఫాబాద్ జిల్లా పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఆయన గురువారం కాగ జ్ నగర్‌కు వచ్చారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాన్ని ఉన్నతస్థాయిలో నిలిపిన కేసీఆర్ వ్యక్తిత్వాన్ని బద్నాం చేసేలా సిట్ పేరుతో సర్కారు యత్నిస్తోందని ఆరోపించారు. ఆ నోటీసులకు ఎవరూ భయపడరని అన్నారు. సమావేశంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
