ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం : ఎమ్మెల్సీ దాసోజు కామెంట్

ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను  అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం : ఎమ్మెల్సీ దాసోజు కామెంట్
  • ఎమ్మెల్సీ దాసోజు కామెంట్

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రాకుండా నిషేధం విధిస్తూ స్పీకర్ బులెటిన్​ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. అడ్వకేట్లను ఫోన్లు తీసుకురావొద్దని చెప్పడం సరికాదని తెలిపారు.

 ఏం గూడుపుఠానీ చేయడానికి ఈ బులెటిన్ ఇచ్చారని ప్రశ్నించారు. కేవలం ఎల్పీ ఆఫీసుల వరకే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ప్రవేశం ఏంటని నిలదీశారు. ఆ బులెటిన్​ను వెనక్కు తీసుకోవాలని కోరుతూ గురువారం ఆయన స్పీకర్​కు లేఖ రాశారు. అనంతరం తెలంగాణ భవన్​లో దాసోజు మీడియాతో మాట్లాడారు.  ఫిరాయింపు ఎమ్మెల్యే విచారణకు అనుమతించకపోవడం ఏంటని ప్రశ్నించారు.