కవితకు అస్వస్థత .. ఢిల్లీలోని ఎయిమ్స్​లో వైద్య పరీక్షలు

కవితకు అస్వస్థత ..  ఢిల్లీలోని ఎయిమ్స్​లో వైద్య పరీక్షలు
  • తిరిగి తిహార్ జైలుకు తరలింపు 

న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా గైనిక్ సమస్య, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఆమెకు జైలు డాక్టర్లు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

 అయితే గురువారం అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షల కోసం ఎయిమ్స్ కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో జైలు అధికారులు ఉదయం 11 గంటలకు కవితను ఎయిమ్స్ కు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని కవిత భర్త అనిల్ కు తెలియజేయగా, ఆయన అక్కడికి వెళ్లారు. అనంతరం టెస్టులు పూర్తయినంక మధ్యాహ్నం ఒంటిగంటకు కవితను తిరిగి జైలుకు తీసుకెళ్లారు.