మీ వయసేంది..మాట్లాడే మాటలేంది.?..జీవన్ రెడ్డిపై కవిత విమర్శలు

మీ వయసేంది..మాట్లాడే మాటలేంది.?..జీవన్ రెడ్డిపై కవిత విమర్శలు

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు. జీవన్ రెడ్డి ఆయన స్థాయిని మరిచిపోయి దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.  ఆయన వయసేంది? మాట్లాడే మాటలేంటని మండిపడ్డారు.  తనను క్వీన్ ఎలిజబెత్ రాణి అని పిలుచుడుకాదు..  తాను ఇటలీ రాణిలా వందలాది తెలంగాన బిడ్డల ప్రాణాలను బలితీసుకోలేదని మండిపడ్డారు.  ఒక ఎన్నిక గెలవడానికి జీవన్ రెడ్డి ఇంత దిగజారి మాట్లాడుతారా  అని ప్రశ్నించారు కవిత. జగిత్యాల ప్రజలు జీవన్ రెడ్డిని ఖచ్చితంగా తిరస్కరిస్తారని అన్నారు.

బతుకమ్మను అవహేళన చేస్తూ దిగజారుడు మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మను అవమానించిన జీవన్ రెడ్డి  క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాహుల్ గాంధీ గారూ, దోశ బండి వద్దకు కాదు... అమరవీరుల తల్లుల దగ్గరికి వెళ్ళండి.. అప్పుడు మీకు బాధ అర్థమవుతుందని సూచించారు. రాహుల్ గాంధీ బబ్బర్ షేర్ కాదని.. ఆయన పేపర్ టైగర్ అని సెటైర్లు వేశారు కవిత. 

2023 అక్టోబర్ 19వ తేదీ గురువారం రోజున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా పట్టణంలో ఇంటింటికి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన .... ఎమ్మెల్సీ కవితపై నిప్పులు చెరిగారు.   ఎన్నికల ప్రచారంలో భాగంగా..  గతంలో క్వీన్ ఎలిజబెత్ ఉండేదని.. ఇప్పుడు లిక్కర్ క్వీన్ కవిత వచ్చిందని ఎద్దేవా చేశారు. 

బిఆర్ఎస్ సర్కారు వస్తే బతుకమ్మ మీద గౌరమ్మకు బదులు లిక్కర్ బాటిల్ పెడుతారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు చేసే అర్హత లిక్కర్ క్వీన్ కవితకు లేదన్నారు. గతంలో ఐదు ఏళ్లు ఎంపిగా ఉన్న కవిత.. ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. షుగర్ ఫ్యాక్టరీ మూపించిన ఘనత కవితకే దక్కుతుందని జీవన్ రెడ్డి మండిపడ్డారు.