తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు  కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని లోక్ సభలో  బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీనికి సమాధానమిచ్చిన కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్కు మంజూరు చేసినట్లు చెప్పారు.దేశంలో 12వేలకు పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయని..బల్క్ డ్రగ్స్ ను దేశంలోనే ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిఎల్ఐ స్కీం లో దేశంలో మూడు చోట్ల బల్క్ డ్రగ్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 

ఒక్కో పార్కు 1000 కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నామని  కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా తెలిపారు. 13 రాష్ట్రాల నుంచి కేంద్రానికి దరఖాస్తులు వచ్చాయని స్పష్టం చేశారు. తెలంగాణ లో బల్క్ డ్రగ్స్ పార్కు కు ఆమోదం తెలిపామని..ఈ పార్క్  ఏర్పాటుకు అయ్యే రూ.వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో కూడా బల్క్ డ్రగ్స్  పార్కులు ఏర్పాటు చేస్తున్నామని లోక్ సభలో స్పష్టం చేశారు.