-
గులాబీ పార్టీలో మిగిలే ఆ నలుగురు ఎవరో వారే చెప్పాలి
-
వస్తామంటే వద్దంటమా?:
-
మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని.. పార్టీలోకి చేరుతాం అంటే ఎవరైనా వద్దంటారా? అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కారు పార్టీలో మిగిలే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరో ఆ పార్టీ నేతలే చెప్పాలని సెటైర్వేశారు. తెలంగాణ సంగీత నాట్య అకాడమీ అధ్యక్షురాలిగా కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత , కూచిపూడి నృత్య గురువు ఆలేఖ్య పుంజాల రవీంద్రభారతిలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరయ్యారు. ఈసందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఫిరాయింపులను ప్రోత్సహించాలని మేం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదన్నారు.
ALSO READ |జూలై 16న సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం.. 9 పాయింట్స్!
గతంలో బీఆర్‌ఎస్ వేరే రకంగా చేరికలు చేసుకుంది. భయపెట్టి మా పార్టీ ఎమ్మెల్యేలను అప్పుడు బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. కానీ, మేం అలాకాదు. ఇప్పుడు మేం ఎవరిని బెదిరించడం లేదు. వారంతట వారే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ప్రజలకు సేవ చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు వస్తున్నారు. నైతికంగా బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు మమ్మల్ని అడిగే, మాట్లాడే హక్కు లేదు. సంక్షేమం, అభివృద్ధిలో చెప్పిన పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి పాత్రదారులుగా ఉండేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారు’ అని అన్నారు.