
మోడీ సర్కార్ గ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచుకుంటూ పోతున్నద బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఎనిమిదేండ్లలోనే మూడు సార్లు రెట్లు పెంచి పేదల నడ్డి విరిచిందని ఆరోపిస్తున్నారు. సిలిండర్ ధరను పిరం చేసి.. సామాన్యుల బతుకు భారంగా మారుస్తున్నదని మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై విసుగు చెందిన బీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు, మహిళలు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ధరలు తగ్గించడంలో కేంద్రం విఫలమైందంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. కట్టెల పొయ్యే దిక్కయ్యేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ఫరూక్ నగర్ మండల తాహాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ప్లకార్డులను, ఖాళీ సిలిండర్లను ప్రదర్శించి ఆందోళన చేపట్టారు.