మధ్యాహ్నం 1.30కి బీఆర్ఎస్ ​బహిరంగ సభ

మధ్యాహ్నం 1.30కి బీఆర్ఎస్ ​బహిరంగ సభ
  • పార్టీలో చేరనున్న మహారాష్ట్ర నాయకులు

హైదరాబాద్, వెలుగు : మహారాష్ట్రలోని నాందేడ్​లో ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్​బహి రంగ సభలో  సీఎం కేసీఆర్​ పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రగతి భవన్​లో కేబినెట్​సమావేశం ముగియగానే ఆయ న బేగంపేట ఎయిర్​పోర్టుకు చేరుకుంటారు. స్పెషల్​ ఫ్లైట్​లో బయల్దేరి.. మధ్యాహ్నం 12.30 గంటలకల్లా నాందేడ్​ ఎయిర్ ​పోర్టులో కేసీఆర్​దిగుతారు. అనంతరం బీఆర్ఎస్​ బహిరంగ సభా వేదిక సమీపంలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి నాందేడ్​లోని చారిత్రక గురుద్వారాకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30కు బహిరంగ సభా వేదిక వద్దకు కేసీఆర్​ చేరుకొని.. హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సభ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు బీఆర్​ఎస్​లో చేరనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నాందేడ్​లోని సిటీ ప్రైడ్​ హోటల్​కు చేరుకొని కేసీఆర్​ భోజనం చేస్తారు. అక్కడే జాతీయ, మహారాష్ట్ర మీడియా ప్రతినిధులతో భేటీ అవుతారు. 5 గంటలకు నాందేడ్​ ఎయిర్​ పోర్టు నుంచి హైదరాబాద్​కు బయల్దేరుతారు. ఈమేరకు కేసీఆర్​ నాందేడ్​ టూర్​ వివరాలను సీఎంవో వెల్లడించింది.

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పలు రాష్ట్రాల లీడర్ల భేటీ

చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు శనివారం ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌లో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో భేటీ అయ్యారని  సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. చత్తీస్ గఢ్ కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, బాలాఘాట్  (మధ్యప్రదేశ్) మాజీ ఎంపీ బోధ్ సిం గ్ భగత్, భండారా (మహారాష్ట్ర) మాజీ ఎంపీ కుషాల్ భోప్చే, సారంగద్  (ఛత్తీస్ గఢ్) మాజీ మంత్రి డాక్టర్ చబ్బీలాల్ రాత్రే, గడ్చిరోలి జెడ్పీ మాజీ చైర్మన్ పసుల సమ్మయ్య పోచమ, గడ్చిరోలి జిల్లా రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్​ సమావేశమయ్యారని సీఎంవో వెల్లడించింది.