ఏప్రిల్ 15న మెదక్లో బీఆర్ఎస్ బహిరంగ సభ

ఏప్రిల్ 15న మెదక్లో బీఆర్ఎస్ బహిరంగ సభ

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన  బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలపై గట్టి ఫోకస్ చేసింది. ఇప్పటికే అభ్యర్థులను ఫైనల్ చేసిన ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ఎన్నికల ప్రచార దూకుడు పెంచేశారు. కరీంనగర్   సభతో ఎన్నికల శంఖరావాన్ని పూరించిన కేసీఆర్..   ఏప్రిల్ 15న మెదక్ లో పర్యటించనున్నారు. మెదక్ లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. దాదాపుగా లక్షమందితో సభను నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. 

మెదక్  పార్లమెంట్ స్థానంపై మొదటినుంచి బీఆర్ఎస్ కు మంచి పట్టుంది.  2009 నుంచి ఇక్కడి  బీఆర్ఎస్ గెలుస్తూ వస్తుంది.  2014, 2019లో ఇక్కడి నుండి ఎంపీగా గెలిచిన  కొత్త ప్రభాకర్ రెడ్డి  గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.  ఇప్పుడు  ఇక్కడి నుంచి బీఆర్ఎస్ సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని బరిలోకి దించింది బీఆర్ఎస్.  కాంగ్రెస్ నుంచి నీలం మధు,  బీజేపీ నుంచి రఘునందన్ రావు బరిలో ఉన్నారు.