కేసీఆర్ ది​ అవినీతి,నియతృత్వ పాలన : వివేక్​ వెంటకస్వామి

కేసీఆర్ ది​ అవినీతి,నియతృత్వ పాలన : వివేక్​ వెంటకస్వామి
  • చెన్నూరు కాంగ్రెస్​ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి
  • కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్ ​ప్రజాప్రతినిధులు, లీడర్లు 

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ అవినీతి, నియంతృత్వ పాలన సాగుతోందని, కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు దోచుకున్నారని చెన్నూరు కాంగ్రెస్​ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్​ వెంటకస్వామి మండిపడ్డారు. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం​ కేసీఆర్ ​బానిస అని, ఏనాడూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్నారు. బుధవారం జైపూర్​ మండలం శెట్​పల్లి, బెబ్జాల, నర్సింగాపూర్, మద్దులపల్లి, కుందారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు, లీడర్లు భారీ సంఖ్యలో కాంగ్రెస్​లో చేరగా.. వీరికి వివేక్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, వివేక్​ తనయుడు గడ్డం వంశీ కృష్ణ తదితరులు కండువాలు కప్పి ఆహ్వానించారు. 

జైపూర్ మండలంలో..

జైపూర్​ మండలం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎలుగంటి శ్రీనివాస్ రెడ్డి, రైతు బంధు సమన్వయ సమితి మండల ప్రెసిడెంట్ బేతు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో శెట్​పల్లి గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ తిరుపతి గౌడ్, సీనియర్ లీడర్, గ్రామాధ్యక్షుడు అన్నం వెంకన్న, వార్డు మెంబర్లు కొరకొప్పుల శ్రావణ్ గౌడ్, నక్క రాజన్న, మల్లయ్య, సాజన్ గౌడ్, సాజన్ లతో పాటు 300 మంది మహిళలు, యువకులు కాంగ్రెస్​లో చేరారు. నర్సింగాపూర్ గ్రామంలో సర్పంచ్ కొడుకు పండుగ రాజన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కోఆప్షన్ మెంబర్లు మేరడిగొండ రాంబాబు, లక్కాకుల స్వామి, ముత్యాల లత, ఉప సర్పంచ్ ఎడ్ల అనూష, మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ రైతు బాపు, ధర్మపూరి వార్డు మెంబర్లు రాజు

 మధు, సతీశ్​తో పాటు 280 మంది యువతీ యువకులు చేరారు. బెజ్జాల గ్రామంలో సర్పంచ్ జైపాల్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్​కు చెందిన వార్డు మెంబర్లు పూసాల భాగ్య, సత్తయ్య, శెగ్గం లక్ష్మి, ఉప సర్పంచ్ డేగల రామన్న, రైతు గ్రామ కమిటీ అధ్యక్షుడు గుజ్జేటి నారాయణ, మాజీ ఉప సర్పంచ్ సొల్లూరి రాజేశం, గౌడ సంఘం సొసైటీ ప్రెసిడెంట్ జగన్ గౌడ్​తో పాటు 200 మంది మహిళలు, యువతీ యువకులు కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. కుందారం గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, ఎండీ ఫయాజ్,

Also Read :- బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై రైడ్స్ ఎందుకు జరగడం లేదు

సీనియర్ పార్టీ లీడర్లు చల్లా సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అధికార పార్టీకి చెందిన మండల పీఏసీఎస్ వైస్ చైర్మన్ సంతోషం చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ నర్సింగ రావు, వార్డు మెంబర్లు ఎలుకటూరి రాములు నిమ్మ మల్లేశ్, మాజీ వార్డు మెంబర్లు, 400 మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో భీమారం, జైపూర్ మండల సీనియర్ లీడర్లు చల్లా విశ్వంబర్ రెడ్డి, చేకుర్తి సత్యనారాయణ రెడ్డి, ఎండీ ఫయాజ్, తాళ్లపల్లి కిరణ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, ఇసంపల్లి రాజన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.

నల్లాల ఓదెలు, గడ్డం వంశీకృష్ణ సమక్షంలో..

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ సమక్షంలో పలువురు బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు, లీడర్లు కాంగ్రెస్ లో చేరారు. మందమర్రి మాజీ ఎంపీపీ బొలిశెట్టి కనుకయ్య, పీఏసీఎస్​వైస్ చైర్మన్​ విక్రమ్​ గౌడ్, బొక్కలగుట్ట వార్డు మెంబర్​ మాసు శ్రీనివాస్​తో పాటు కుల సంఘాల బాధ్యులు, బీఆర్​ఎస్​లీడర్లు పెద్ద సంఖ్యలో చేరారు. మందమర్రి మండలం పులిమడుగు సర్పంచ్ భూక్య మోహన్..​వివేక్​ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.

నేతకాని హక్కుల సంఘం మందమర్రి మండల యూత్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో సారంగపల్లి, తుర్కపల్లి, గుడిపల్లి గ్రామాలకు చెందిన యువకులు చేరారు. మందమర్రిలో వీరంరాజు, కనకం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 150 మంది తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్​ లీడర్లు, మహిళలు నల్లాల ఓదెలు నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్​లో చేరారు.

వీరికి వివేక్​ వెంకటస్వామి, నల్లాల ఓదెలు, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్​ జనక్​ ప్రసాద్, దుర్గం నరేశ్, కాంపెల్లి సమ్మయ్య, దేవి భూమయ్య పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివేక్​ వెంకటస్వామి-సరోజ దంపతులను నల్లాల ఓదెలు, మంచిర్యాల జడ్పీ చైర్​ పర్సన్​ నల్లాల భాగ్యలక్ష్మి దంపతులు ఘనంగా సన్మానించారు.