బీఆర్ఎస్గా మారిన గుర్తింపు ఇవ్వని లోక్‌సభ

బీఆర్ఎస్గా మారిన గుర్తింపు ఇవ్వని లోక్‌సభ

టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌‌‌గా మారినా లోక్‌సభ సచివాలయం గుర్తింపు ఇవ్వలేదు. బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) నుంచి బీఆర్‌ఎస్‌ను తొలగించింది. ఇప్పటివరకూ ఆ పార్టీ తరఫున ఎంపీ నామా నాగేశ్వరరావు బీఏసీ సభ్యుడిగా ఉండగా.. ఇవాళ సమావేశానికి ఆయన్ను కేవలం ఆహ్వానితుడిగానే లోక్‌సభ సచివాలయం ఆహ్వానించింది. ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులున్న పార్టీకి బీఏసీ సభ్యత్వం ఉంటుంది. బీఆర్‌ఎస్‌కు లోక్‌సభలో 9 మంది సభ్యులున్నారు. అయినప్పటికీ లోక్‌సభ సెక్రటేరియట్ ఆ పార్టీని బీఏసీ నుంచి తొలగించింది. దీంతో లోక్‌సభ బీఏసీలో ఇకపై ఆహ్వానిత పార్టీగానే బీఆర్‌ఎస్ కొనసాగనుంది. ఆహ్వానం పంపితేనే బీఏసీ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది.